DEEPIKA: ప్ర‌భాస్ స‌ర‌స‌న దీపిక.. సెట్స్‌లో ఎప్పుడు అడుగుపెట్ట‌నుందంటే..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సాహో చిత్రం త‌ర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం చాలా వ‌ర‌కు ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంది. కొంత పార్ట్ హైద‌రాబాద్‌లో జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. దీంతో చిత్రం జూలై 30న విడుద‌ల కానుండడం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఇక ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే చిత్రం చేస్తున్న ప్ర‌భాస్ మ‌రోవైపు బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు.

స‌లార్, ఆదిపురుష్ చిత్రాల షూటింగ్‌ల‌ను ఏక‌కాలంలో పూర్తి చేయాల‌ని భావించిన ప్ర‌భాస్ క్ష‌ణం తీరిక లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. అయితే క‌రోనా వ‌ల‌న ఈ రెండు చిత్రాల‌కు కూడా బ్రేక్ ప‌డిన‌ట్టు తెలుస్తుంది. వీలైనంత త్వ‌ర‌గా ఈ రెండు చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేసి అక్టోబ‌ర్ లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న పీరియాడిక‌ల్ మూవీని ప్ర‌భాస్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ముందుగా జూలైలో చేయాల‌ని ప్ర‌భాస్ భావించిన‌ప్ప‌టికీ, ప‌రిస్థితులు అస్త‌వ్య‌స్తంగా మారాయి. దీంతో అక్టోబ‌ర్లో ఈ సినిమాను మొద‌లు పెట్టాల‌ని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న దీపిక ప‌దుకొణే కూడా అక్టోబ‌ర్ నుండి టీంతో జాయిన్ కానుంద‌ని స‌మాచారం. దీపిక కూడా ఇప్ప‌టికే ప‌లు సినిమాలు క‌మిట్ కాగా, వాటన్నింటిని అడ్జెస్ట్ చేసుకొని అక్టోబ‌ర్‌లో నాగ్ అశ్విన్ మూవీ టీంతో క‌లవ‌నుంద‌ట‌. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. అశ్వినీద‌త్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement