Bollywood: ఆ స్టార్ హీరోయిన్ బాడీ గార్డ్ సాల‌రీ పెద్ద పెద్ద అధికారుల‌కు కూడా రాదేమో..!

Bollywood: ప్ర‌స్తుతం సినీ సెల‌బ్రిటీల‌కు ప్ర‌జ‌ల‌లో చాలా క్రేజ్ ఉంది. వారిని చూసేందుకు జ‌నాలు ఎగ‌బ‌డుతుంటారు. ఏదైన ప‌ని మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన లేదంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వ‌చ్చిన అభిమానుల‌ని కంట్రోల్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌రిస్థితి. ముఖ్యంగా హీరోయిన్స్ బ‌య‌ట‌కి వెళ్లిన‌ప్పుడు అభిమానుల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్ర‌మంలో భారీగా సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు.

Bollywood

అయితే టాప్ మోస్ట్ ఉద్యోగి క‌న్నా ఎక్కువ సాల‌రీలు కొంత మంది హీరోయిన్స్ త‌మ బాడీగార్డ్స్‌కి ఇస్తుండడం విశేషం. ‘ఓం శాంతి ఓం’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దీపిక తొలి చిత్రంతోనే స్టార్‌ ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఈ అమ్మ‌డికి ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీపిక కాలు బయటపెట్టాంటే బాడీగార్డ్‌ ఉండాల్సిందే.

దీపికాకు ఎప్ప‌టి నుండో బాడీగార్డ్ పేరు జలాల్‌. దీపికాని కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఆమె బాడీగార్డ్‌ జలాల్‌. ఔట్‌డోర్స్‌కి వెళ్లినప్పుడు దీపికా తప్పనిసరిగా అతని సాయాన్ని కోరుతుంది. అంతేకాదు జలాల్‌ని తన సొంత సోదరుడిలా ట్రీట్‌ చేస్తుందట.

Bollywood

జలాల్‌కు నెలకి అక్షరాలా 6.5 లక్షల రూపాయలు జీతంగా అందిస్తుంద‌ట దీపిక‌. అంటే ఈ లెక్కన ఏడాదికి 80 లక్షల వరకు వస్తుందట. ఓ ఎమ్‌ఎన్‌సి కంపెనీలో పనిచేసే టాప్ గ్రేడ్ ఎంప్లొయ్ కి కూడా బహుశా ఇంత శాలరీ ఉండదమో అనిపించేలా దీపిక బాడీగార్డ్‌కు లక్షల్లో నెలవారీ జీతం వస్తుందట. రణ్‌వీర్ -దీపికాల పెళ్ళి సమయంలో జలాల్‌ సెక్యూరిటీ హెడ్‌గా విధులు నిర్వర్తించినట్టు టాక్.

క‌రోనా వ‌ల‌న కొన్నాళ్లుగా ఇంటికే ప‌రిమిత‌మైన దీపిక ప్ర‌స్తుతం త‌ను క‌మిటైన ప్రాజెక్ట్స్‌లో న‌టించేందుకు సిద్ధంగా ఉంది. ఈ అమ్మ‌డు త‌న భ‌ర్త‌తో క‌లిసి న‌టించిన 83 చిత్రం విడుద‌లకు సిద్దంగా ఉంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ సినిమాకు కూడా దీపిక సైన్‌ చేసింది. ఈ సినిమాతో దీపికా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతుంది.