Deepika Padukone : ప్ర‌భాస్ సినిమా కోసం హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన దీపికా.. !

Deepika Padukone : చూడ‌చ‌క్క‌ని అందంతో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొణే ఇన్నాళ్లు హిందీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నాగ్ అశ్విన్ సినిమా కోసం దీపికా పదుకొణె హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘ప్రాజెక్ట్‌- కె’లో (వర్కింగ్‌ టైటిల్‌) ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Deepika Padukone in Hyderabad for project K
Deepika Padukone in Hyderabad for project K

ప్రస్తుతం దీపికాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. నగరానికి చేరుకున్న దీపికా లిలాక్‌పాంట్‌ సూట్‌, వైట్‌ క్రాప్‌ టాప్‌లో దర్శనమిచ్చారు. హిందీ పరిశ్రమలో తనదైన సత్తా చాటిన దీపికకు తెలుగులో ఇదే తొలి చిత్రం. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

Deepika Padukone in Hyderabad for project K
Deepika Padukone in Hyderabad for project K

బిగ్‌ బి అమితాబ్‌ ఇందులో కీకల పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది జులైలో గురు పూర్ణిమ సందర్భంగా అమితాబ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ‘మహానటి’కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డాని శాంచెజ్-లోపెజ్.. ఈ చిత్రానికి పనిచేస్తుండగా.. మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్​ను కొంత కాలం క్రితం ప్రారంభించి బిగ్​బీ​పై ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారు. ఇక ప్రభాస్​.. నటించిన ‘రాధేశ్యామ్’​ షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్​ మళ్లీ ప్రారంభంకానుందన్న చర్చ జరుగుతుంది. డిసెంబరు 5 నుంచి దీపిక షూట్​లో పాల్గొంటారని సమాచారం. 7న ప్రభాస్ కూడా షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

దీపిక పదుకొనె.. త్వరలోనే ’83’ మూవీతో ప్రేక్షకుల పలకరించబోతుంది. దీంతో పాటు రణ్​వీర్​ సింగ్​తో ‘సర్కస్​’, షారుక్​తో ‘పఠాన్’ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్​’ జనవరి 14న విడుదల కానుంది.