David warner: సామి సామి పాట‌కు వార్న‌ర్ కూతుళ్లు అదిరిపోయే స్టెప్పులు.. బ‌న్నీ రియాక్ష‌న్ ఏంటి?

David warner: పుష్ప హ‌వా కొన‌సాగుతూనే ఉంది. క్రికెట‌ర్స్, సెల‌బ్స్ ఇలాచాలా మంది పుష్ప సినిమాపై త‌మ ప్రేమను క‌న‌బ‌రుస్తున్నారు. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం అన్ని భాషల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్‌ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాట ఈ పాట అనే తేడా లేకుండా అన్ని సాంగ్స్‌ హంగామా సృష్టించాయి.

Davidwarner daughters dance for sami sami1
Davidwarner daughters dance for sami sami1

సోషల్ మీడియాలో పుష్ప ఈ సినిమా సాంగ్స్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పుష్ప మూవీలోని పాటలకు స్టెప్పులేస్తున్నారు. అల్లు అర్జున్.. రష్మిక.. సమంత వేసిన స్టెప్పులను ఫాలో అవుతూ నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. ఎక్కడ విన్నా… చూసిన పుష్ప పాటలే. ఇప్పటికే ఖండాంతరాలను దాటి పుష్ప క్రేజ్ కొనసాగుతుంది.

సామాన్యులే కాదు.. క్రికెటర్స్ కూడా పుష్ప రాజ్ స్టైల్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల‌ ఆస్ట్రేలియాలోని వియన్నాకు చెందిన ఓ వ్యక్తి శ్రీవల్లి పాటకు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. గతంలో ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా’, ‘నీయవ్వ తగ్గేదేలే…’ లను అనుకరించిన వార్నర్.. రీసెంట్‌గా శ్రీవల్లి పాటకు కాలు కదిపాడు. ఆ పాటకు బన్నీ వేసిన స్టెప్పులనే అచ్చు గుద్దినట్టు దించాడు.

తాజాగా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూతుళ్లు కూడా నా సామీ అంటూ డ్యాన్స్‌ చేశారు. ‘అమ్మానాన్నల కంటే ముందే పిల్లలు సామీ సామీ పాటకు డ్యాన్స్‌ చేయాలనుకున్నారు’ అంటూ ఈ వీడియోను వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇది చూసిన బన్నీ సో క్యూట్‌ అంటూ నవ్వాపుకోలేకపోతున్న ఎమోజీని జత చేశాడు.

థియేటర్లలో సంచలన విజయం సాధించిన పుష్ప చిత్రం ఓటీటీలో సందడి చేస్తుంది. ఈ సినిమా సౌత్‌ డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ రూ. 22 కోట్లకు కోనుగోలు చేసింది . పుష్ప థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఇదిలా ఉంటే పుష్ప చిత్రానికి పార్ట్‌2 గా తెరకెక్కనున్న ‘పుష్ప ది రూల్‌’ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభించి. ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నారని సమాచారం.