Dasari: చంపేస్తామ‌ని బెదిరిస్తున్న దాస‌రి కుమారులు.. కేసు న‌మోదు

Dasari: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుల‌లో దాస‌రి నారాయ‌ణ రావు త‌ప్ప‌క ఉంటారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా,నిర్మాత‌గా ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించిన దాస‌రి నారాయ‌ణ‌రావు చాలా మంది సినీ కార్మికుల‌కి అండగా నిలిచారు. జీవిత కాలంలో ఏనాడు వివాదాలకి వెళ్లలేదు దాస‌రి నారాయ‌ణ రావు. అయితే ఆయ‌న కుమారులు త‌ర‌చు వివాదాల‌లో నిలుస్తున్నారు.

దాస‌రి మరణానంతరం ఆయన కుటుంబంలోనే అనేక వివాదాలు, గొడవలు చోటు చేసుకున్నాయి. ఆస్తుల విష‌యంలో దాసరి కుమారులు అరుణ్, ప్రభు మధ్య గొడవలు జరిగాయి. వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పరిశ్రమ పెద్దల చొరవతో ఆ గొడవ సద్దుమణిగినట్లు సమాచారం. తాజాగా మరో వివాదంలో దాసరి కుమారులు చిక్కుకున్నారు. తీసుకున్న అప్పు అడిగితే చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో వారిపై పోలీస్ కేసు న‌మోదు చేశారు.

గుంటూరుకి చెందిన అట్లూరి సోమశేఖర్ దాసరికి చాలా సన్నిహితుడు. దాసరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన పలు దఫాలుగా రూ. 2.10 కోట్లు అప్పుగా ఇవ్వడం జరిగింది. దాసరి మరణం తరువాత పెద్దల సమక్షంలో అసలు ఇవ్వాల్సి మొత్తానికి బదులు రూ. 1.15 కోట్లు ఇవ్వడానికి అరుణ్, ప్రభు ఒప్పుకున్నారు.

సోమశేఖరరావు ఈ నెల 27న జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 46లోని దాసరి నివాసానికి వెళ్లి ప్రభు, అరుణ్‌ను డబ్బులు ఇవ్వమని అడిగారు. మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు ఆయనను భయపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. దాసరి నారాయణరావుతో ఆయన సన్నిహితంగా ఉండేవారు