దాసరి కొడుకుల సమస్య పరిష్కారానికి బయల్దేరిన చిరంజీవి

Advertisement

దాసరి నారాయణ రావు కొడుకుల మధ్య వివాదం. ఆ వివాదాన్ని పరిష్కరించాలన్న నిర్ణయం తో బయలుదేరిన చిరంజీవి. అసలు వారివురి మధ్య గొడవకి కారణం ఏంటి. అసలు ఎం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే గత కొంత కాలం క్రితం దాసరి నారాయణ రావు గారు తెలుగు సినీ పరిశ్రమ కు పెద్ద దిక్కుగా వ్యవహరించడం అందరికి తెలిసన విషయమే ఆ సమయం లో ఆయన ఎవ్వరికి ఏ సమస్య వచ్చిన వెంటనే తనదైన రీతిలో దానిని పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు.

కాగా ఆయన ఆకస్మిక మరణం తో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కుని కోల్పోవడం జరిగింది. ఆయన మరణం తర్వాత మరల ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సినీ పెద్దలు కొంతమంది తీసుకున్న నిర్ణయం మేరకు చిరంజీవి గారు ఆ స్థానాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం అయన కొడుకులు అయినటువంటి అరుణ్ మరియు ప్రభు ఆస్థుల వివాదం లో ఒకరి పైన ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసుకున్నారు. దీనికి గల కారణం చనిపోయే ముందు దాసరి నారాయణ రావు వారి కొడుకులకు అందేటువంటి భూములు మరియు ఆస్తులు వారిరువురికి సమాన రీతిలో రాయకపోవడమే కారణం అన్న విషయం తెలుస్తుంది.

దానితో వారిరువురు మధ్య వాగ్వాదాలు తలెత్తడం ఈ సమస్యని వారివురు పరిష్కరించుకోవడానికి ఒకరి పైన మరొకరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసుకోవడం కూడా జరిగింది అంట. అయితే ఇలా అంత పెద్ద గొప్ప వ్యక్తి కొడుకులు ఆస్తి విషయాలలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం తో ప్రస్తుత దాసరి నారాయణ రావు గారి స్థానం లో ఉన్న చిరంజీవి గారు స్పందించి ఆయన గౌరవానికి ఏ మాత్రము ఆటంకం కలగకుండా వారివురిని కలిసి ఆ సమస్య పైన చర్చలు జరిపి ఆ సమస్యని పరిష్కరించాలన్న నిర్ణయం తీసుకున్నాడు అంట.

ఎందుకంటే ఒక వేళ దాసరి గారు ఉన్న అదే పని చేసేవాడు వారివురు మధ్య సమస్య తలెత్తితే దాసరి నారాయణ రావు కొడుకులిద్దరిని దగ్గరికి పిలిచి ఆ సమస్య కు ఒక పరిష్కారాన్ని అందచేసే వాడు . ఆయన లేకపోవడం తో ఆ సమస్యకు పరిష్కారం అందించి మరల వారిరువురి ని కలపాలన్న నిర్ణయం చిరంజీవి గారు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అరుణ్ మరియు ప్రభు లు దాసరి స్థానం లో ఉన్న చిరంజీవి సూచించే సలహా మేరకు ఒక నిర్ణయానికి వచ్చి సమస్యని పరిష్కరించుకుంటారో లేదా అవేవి వినకుండా కోర్టు లోనే ఈ విషయాన్నీ తేల్చుకుంటారో చూడాలి మరి .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here