Darshan : పునీత్ సంస్మ‌ర‌ణ స‌భ‌లో స్టార్ హీరోకు ఘోర అవ‌మానం..!

Darshan : క‌న్న‌డ ప‌వర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి త‌ర్వాత అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వాటికి భారీగా జ‌నాలు హాజ‌ర‌య్యారు. పునీత్ రాజ్ కుమార్ కార్యం కు కూడా అన్నదానంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా చిన్నపాటి తొక్కీసలాట జరిగింది.

darshan vs police at bengaluru police
darshan vs police at bengaluru police

తాజాగా పునీత్ రాజ్ కుమార్ సంతాప సభను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఈ సంతాప సభకు కూడా భారీ ఎత్తున జనాలు వస్తారనే ఉద్దేశ్యంతో పాస్ లు ఉన్న వారికి మాత్రమే అనుమతి అంటూ ప్రకటించి ప్రముఖులకు మరియు అభిమాన సంఘాల వారికి పాస్ లను పంపించడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు వందకు పైగా వీఐపీలు హాజరు అయిన కార్యక్రమం కనుక పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.

పాస్‌లు లేని వారిని సంతాప స‌భ‌లోకి అడుగుపెట్ట‌నివ్వ‌లేదు. ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం కన్నడ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో తెగ చర్చనీయాంశంగా మారింది. పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు గాను కన్నడ స్టార్ హీరో అయిన దర్శన్ హాజరు అయ్యేందుకు అక్కడకు చేరుకున్నాడు.

ఆయన చేతిలో పాస్ లేకపోవడంతో లోనికి వెళ్లనిచ్చేది లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. దర్శన్ ఒక స్టార్ హీరో కావడంతో పాస్ లేకుండానే పంపించాల్సి ఉంటుంది. కాని పోలీసులు మాత్రం అత్యుత్సాహంతో ఆయన్ను బయటే నిలిపి వేశారు. ఆ సమయంలో దర్శన్ అభిమానులు మరియు మద్దతు దారులు అక్కడ కాస్త గందరగోళం క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారందరిని అక్కడ నుండి పంపించేందుకు వెంటనే చెదరగొట్టేశారు.

ద‌ర్శన్ కొద్ది సమయం అలా పక్కన నిలబడి అయినా వెళ్తాను అన్నాడు. అయినా కూడా పోలీసులు ఒప్పుకోక పోవడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. దర్శన్ వంటి స్టార్ హీరోను కన్నడనాట ప్రతి ఒక్కరు గుర్తు పడుతారు. పోలీసులకు కూడా ఆయన స్టార్ హీరో.. పెద్ద సెలబ్రెటీ అనే విషయం తెలుసు. అయినా కూడా ఎందుకు వారు దర్శన్ ను అనుమతించలేదు అనేది చర్చనీయాంశంగా మారింది .దర్శన్ ను అవమానించినందుకు గాను ఖచ్చితంగా పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.