Prabhas: ప్ర‌భాస్ అన్ని కోట్లు సంపాదించాడా.. పూర్తి వివ‌రాలు తెలుసుకొని నోరెళ్ల‌పెడుతున్న ఫ్యాన్స్

Prabhas టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రభాస్ బాహుబ‌లి సినిమా త‌ర్వాత పాన్ ఇండియా స్టార్‌గామారాడు. భవిష్యత్తులో ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఈ హీరో తొలి హిందీ సినిమా బాహుబలి అని చాలామంది అనుకుంటారు. కానీ బాహుబలి కంటే ముందు బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో నటించాడు ప్రభాస్. కాకపోతే అది గెస్ట్ రోల్ మాత్రమే.

Prabhas

ప్రభాస్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే, ఇతడు హీరో అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. స్వతహాగా భోజనప్రియుడైన ఈ హీరో, మంచి హోటల్స్ పెడదాం అనుకున్నాడు. హోటల్ బిజినెస్ నే కెరీర్ గా మలుచుకుందామనుకున్నాడు. కానీ అనుకోకుండా హీరోగా మారాడు. అదే అతని కెరీర్ అయింది.

సినిమాల్లోకి వ‌చ్చాక ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌చ్చిన ప్ర‌భాస్ కి దాదాపు 215 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లుగా సమాచారం. ప్రభాస్ తను సంపాదించే వాటిలో కొంతమేరకు అనాధ పిల్లల ఖర్చులకోసం చారిటీస్ కి డొనేట్ చేస్తూ ఉంటాడట. ప్రభాస్ హైదరాబాదులో 62 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు ఉన్నట్లుగా సమాచారం.

ప్రభాస్ చేసేటటువంటి జిమ్ము పరికరాల విలువ కోటిన్నర రూపాయలు ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ దగ్గర ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నవి. ప్రభాస్ దగ్గర 8 ఖరీదైన కార్లు ఉన్నవి. వాటి విలువ 20 కోట్ల పైగా ఉంది. ఇక ప్రభాస్ దగ్గర ఉన్న 5 టూ వీలర్స్ విషయానికి వస్తే వీటన్నిటితో ధర 70 లక్షలకు పైగానే ఉంటుంది. ఇదంతా ప్రభాస్ ఆస్తి విలువ.