Dancing Dad: స‌మంత మాస్ సాంగ్‌కి డ్యాన్సింగ్ డాడ్ అద‌రిపోయే స్టెప్పులు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Dancing Dad: పుష్ప సినిమాలో ఊ అంటావా మావ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సాంగ్ కి చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తెక్కించే వాయిస్‏తో మెస్మరైజ్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఊ అంటావా మావ.. ఊహు అంటావ పాటకు స్టెప్పులేస్తు అదరగొడుతున్నాయి.

Dancing Dad Perform to Oo Antava Mama Song
Dancing Dad Perform to Oo Antava Mama Song

దేవీశ్రీ సంగీతం అందించిన ఈ సినిమాలో సమంత పాట ఒక హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఈ పాట లిరికల్ వీడియో సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాటకు అమెరికాకు చెందిన రికీ పాండ్ తనదైన స్టైల్లే డ్యాన్ చేసి ఆకట్టుకున్నాడు.అమెరికాకు చెందిన రికీ పాండ్ భారతీయ పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. తన కుటుంబంతో కలిసి ఇండియన్ సాంగ్స్‎కు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తుంటారు.

తాజాగా సమంత నటించిన ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ అల్లు అర్జున్, సమంత, రష్మిక మందన్న, మైత్రీ మూవీ ఆఫిషియల్స్, కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ లకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Dancing Dad Perform to Oo Antava Mama Song
Dancing Dad Perform to Oo Antava Mama Song

స్టార్ హీరోయిన్ సమంత కెరీర్‌లో తొలిసారి న‌ర్తించిన ఐటెమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ‌.. ఉ ఉ అంటావా మావ‌’ సాంగ్‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లైన ఈ చిత్రం టాప్ గ్రాసర్ ఆఫ్ 2021గా నిలిచి బాలీవుడ్ సినిమాల‌కే స‌వాలు విసిరింది.

ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే, ఇందులో స‌మంత ఐటెం సాంగ్ మ‌రో ఎత్తు. గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ ‘ఊ అంటావా మావ .. ’ అంటూ స‌మంత సిల్వ‌ర్ స్క్రీన్‌పై అల్లు అర్జున్‌తో క‌లిసి వేసిన చిందుల‌కు ఇటు ఫ్యాన్స్‌.. అటు మాస్ ఆడియెన్స్ ఊగిపోయారు.