Karthika: ద‌మ్ము హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Karthika: ఎన్టీఆర్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం ద‌మ్ములో క‌థానాయిక‌గా న‌టించిన కార్తీక నాయర్ మీ అంద‌రికి గుర్తుండే ఉంటుంది. తెలుగులో ప్రముఖ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించిన “జోష్” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కార్తీక నాయర్ ఆ త‌ర్వాత తమిళంలో కో(తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో కార్తీక రేంజ్ పెరిగింది. ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టి ఈమెపై ప‌డింది. మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, అక్క‌డ స‌క్సెస్ కాలేక పోయింది. తిరిగి మ‌ళ్లీ తెలుగు ప‌రిశ్ర‌మ‌పై క‌న్నువేసింది.

Karthika Nair

తెలుగులో ‘దమ్ము’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టింది. ఇందులో త‌న న‌ట‌న‌తో అలరించిన కార్తీక ఆ తర్వాత అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రదర్‌ బొమ్మాళి’లో మాస్‌ యాంగిల్‌లో అదరగొట్టింది. ఈ సినిమా త‌ర్వాత కార్తీక‌కు మ‌ళ్లీ ఆఫ‌ర్స్ పెద్ద‌గా రాలేదు. 2017లో ‘ఆరంభ్‌’ అనే హిందీ టీవీ సీరియల్‌లోనూ నటించింది. త‌న త‌ల్లి రాధ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఆ రేంజ్ స్టార్‌డ‌మ్‌ని కార్తీక అందుకోలేక పోయింది. సినిమాల ఎంపిక స‌రిగ్గా లేక‌పోవ‌డంతోనే కార్తీక కెరియ‌ర్‌కు మ‌ధ్య‌లోనే బ్రేక్ ప‌డింద‌ని ట్రేడ్ పండితుల అంచ‌నా

Karthika Nair

కార్తీక ఒకప్పుడు తెలుగులో దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన నటించగా,ఇప్పుడు అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. దీంతో యాక్టింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసిన ఆమె ప్రస్తుతం యూడీఎస్‌ హోటల్‌ గ్రూప్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. కార్తీక ఆ మధ్య కాలంలో హీరోయిన్ గా ఓ చిత్రం చేసింది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడుతుండడంతో ఓటిటి ప్లేట్ ఫారం లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక రాధా రెండో కూతురు విష‌యానికి వ‌స్తే ఆమె పేరు తుల‌సి నాయ‌ర్. ఈమె కూడా హీరోయిన్‌గా చేసింది. ఆ మధ్య కాలంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన “కడలి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.