Rana Daggubati: మ‌నం స్టైల్‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీ చిత్రం

Rana Daggubati తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా ఫ్యామిలీ, నంద‌మూరి, అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యామిలీల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కుటుంబం నుండి హీరోలు ఇండ‌స్ట్రీకి క్యూ క‌డుతున్నారు. కొందరు స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతుండ‌గా, మ‌రి కొంద‌రు విజ‌యాల కోసం ఇంకా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అయితే ఓ కుటుంబానికి సంబంధించి హీరోలు అంద‌రు ఒకే తెరపై క‌నిపిస్తే చూడాలిని అభిమానుల కోరిక‌.

విక్ర‌మ్ కుమార్ ..మనం చిత్రం ద్వారా అక్కినేని ఫ్యామిలీ హీరోలంద‌రిని ఒకే తెర‌పైకి తీసుకొచ్చాడు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్‌, స‌మంత ఇలా అక్కినేని ఫ్యామిలీ మొత్తం మ‌నం సినిమాలో క‌నిపించి అల‌రించారు.ఇప్పుడు ఇదే మాదిరిగా ద‌గ్గుబాటి ఫ్యామిలీ చిత్రం కూడా రూపొందుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని, త్వ‌ర‌లోనే అఫీషియల్ ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు స‌మాచారం.

ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుండి ఇప్ప‌టికే వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తుండ‌గా, వెంకటేశ్ అన్న కొడుకు రానా కూడా .. తన సత్తా ఏమిటో ఇప్పటికే చూపించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోటీన్ కు భిన్నమైన క్యారెక్టర్లు చేయటం.. చాలామంది హీరోలు చెప్పే మాటలకు భిన్నంగా ఆయన తీరు ఉంటుంది. తాజాగా రానా సోదరుడు అభిరాంను వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ క్ర‌మంలో రానా ప‌లు విష‌యాల‌పై స్పందించారు.

త‌న త‌మ్ముడి ప్ర‌యాణం గురించి మాట్లాడిన రానా.. వాడి ప్ర‌యాణం వాడిది. ఇది చెయ్ అది చెయ్ అని బ‌లవంతంగా రుద్దే వాళ్లు ఎవ‌రు లేరు. ఏ పని చేసినా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతామని నమ్ముతామన్నారు. అభిరామ్ బలం ఏమిటో ప్రేక్షకులే చెప్పాలని పేర్కొన్నారు. తమ ఇంటి ఆర్టిస్టులతో కలిసి మనం సినిమా కాదు కానీ కొత్త జోనర్ లో సినిమా ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు రానా.

మ‌నంలా కాక‌పోయిన ద‌గ్గుబ‌టి ఫ్యామిలీ ప్యాక్ ఒక‌టి త్వ‌ర‌లో వ‌స్తుందంటే ఆ సినిమా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. చైతూ, స‌మంత‌లు కూడా ద‌గ్గుబాటి ఫ్యామిలీ స‌భ్యులే కాగా, వారు ద‌గ్గుబాటి ఫ్యామిలీ చిత్రంలో న‌టిస్తారా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.