Cricketers : క్రికెటర్స్ తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్ వీరే..!

NQ Staff - May 31, 2023 / 02:16 PM IST

Cricketers : క్రికెటర్స్ తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్ వీరే..!

Cricketers : సినిమా ఇండస్ట్రీకి, క్రికెట్ కు మన దేశంలో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది క్రికెటర్లు హీరోయిన్లను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఇంకా ఎంతో మంది కేవలం డేటింగ్ వరకే ఆగిపోయారు. పెండ్లి పీటలు ఎక్కి సక్సెస్ అయిన జంటలు మాత్రం కొన్ని మాత్రమే. అలాంటి వారు ఎవరో చూద్దాం.

విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ..

ఈ జంటకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. క్రికెట్ కింగ్ అయిన విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ దాదాపు నాలుగేండ్లు గేటింగ్ చేసి పెండ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప కూడా పుట్టింది.

కపిల్ దేవ్ – సారిక..

క్రికెట్ దిగ్గజం అయిన కలిప్ దేవ్ తో అప్పట్లో హీరోయిన్ సారిక ప్రేమలో పడింది. వరల్డ్ కప్ విన్నర్ అయిన కపిల్ దేవ్ తో ఆమె చాలా కాలం ప్రేమాయణం సాగించింది. కానీ గొడవలు రావడంతో మధ్యలోనే విడిపోయారు.

రవి శాస్త్రి – అమృతా సింగ్..

రవిశాస్త్రి కూడా అప్పట్లో చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది అమృతా సింగ్. వీరిద్దరూ బహిరంగంగా ముద్దులు కూడా పెట్టుకున్నారు. కానీ వీరిద్దరూ త్వరగానే విడిపోయారు. ఆ తర్వాత అమృతాసింగ్ సైఫ్‌ అలీఖాన్ ను పెండ్లి చేసుకుంది.

సౌరవ్ గంగూలీ – నగ్మా..

క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ-నగ్మా ప్రేమ వ్యవహారం అప్పట్లో ఎంత హాట్ టాపిక్ అనేది అందరికీ తెలిసిందే. వీరిద్దరి ప్రేమ అప్ప్లో వివాదానికి దారి తీసింది. కానీ ఏమైందో తెలియదు ఇద్దరూ మధ్యలోనే విడిపోయారు. ఇప్పటికీ నగ్మా సింగిల్ గానే ఉండిపోయింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us