Bheemla Nayak: ఫ‌స్ట్ గ్లింప్స్‌కి ఇంప్రెస్ అయిన భార‌త క్రికెట‌ర్.. అద్భుతం అని కామెంట్

Samsthi 2210 - August 17, 2021 / 03:20 PM IST

Bheemla Nayak: ఫ‌స్ట్ గ్లింప్స్‌కి ఇంప్రెస్ అయిన భార‌త క్రికెట‌ర్.. అద్భుతం అని కామెంట్

Bheemla Nayak: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా, సామాజిక కోణం ఉన్న వ్య‌క్తిగా ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఆయ‌న‌కు సినీ , రాజ‌కీయ‌, క్రీడా రంగంలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప‌వ‌న్ సినిమ‌ల‌కు సంబంధించిన అప్‌డేట్స్ వ‌స్తే ఆయ‌న అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ప్ర‌స్తుతం మలయాళ సూపర్‌హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను రీమేక్ చేస్తున్నాడు.
more ad

more ad

more ad

more ad

Bheemla Nayak

కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్క‌టిగా ఇస్తూ వ‌స్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంద‌నే విషయాన్ని తెలియజేస్తూ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ వీడియో షేర్ చేయ‌గా, ఇది ప‌వ‌న్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసింది. ఒరిజినల్ మూవీలో బిజూ మీనన్ నటించిన క్యారెక్ట‌ర్‌ని ప‌వ‌న్ చేస్తుండ‌గా, తెలుగులో ఆయ‌న పాత్ర‌కు భీమ్లా నాయ‌క్ అనే పేరు పెట్టారు. కోషి కురియన్‌గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా నటిస్తున్నారు.
more ad

more ad

more ad

more ad

ప‌వ‌న్ సినిమా అప్‌డేట్స్ కోసం వేచి చూసే వారిలో భార‌త క్రికెట‌ర్ హ‌నుమ విహారి కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం హ‌నుమ విహారి సిడ్నీలో ఉండ‌గా, ఆయ‌న ఫ‌స్ట్ గ్లింప్స్ పై త‌న స్పంద‌న తెలియ‌జేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు నటిస్తున్న టాలీవుడ్ మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” నుంచి మోస్ట్ పవర్ ఫుల్ గ్లింప్స్ కట్ బయటికి వచ్చి భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. దీనిపై హ‌నుమ‌.. గ్లింప్స్ అద్భుతంగా ఉంద‌ని కామెంట్ పెట్టాడు.
more ad

more ad

more ad

more ad

కాకినాడకు చెందిన హనుమ విహారి ఇదివరకు పవన్ కల్యాణ్‌ను కలిసి ఫొటోలు సైతం తీసుకున్నాడు. వాటిని సోష‌ల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నాడు. ఇక మేకింగ్ వీడియో విడుద‌లైన స‌మ‌యంలో .. భీమ్లా నాయక్, పవన్ కల్యాణ్, పీఎస్‌పీకే రానా అనే పేర్లను మెన్షన్ చేస్తూ ఓ ట్వీట్ వదిలాడు. భీమ్లా నాయక్ ఆన్ ఫైర్ అనే మెసేజీని పంపించాడు.
more ad

more ad

more ad

more ad

హనుమ విహారి.. ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లను ఆడబోతోన్నాడు. అయిదు టెస్ట్ మ్యాచ్‌ ఈ సిరీస్ సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగనుండ‌గా, అప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లండ్ లోనే ఉండ‌నున్నాడు.ప‌వ‌న్ సినిమా కోసం ఆయ‌న ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తుంది.
more ad

more ad

more ad

more ad

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us