Cricket: నాలుగు రోజుల్లో భార‌త్‌తో మ్యాచ్‌..రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ ఆల్‌రౌండ‌ర్..!

Cricket: ఆగ‌స్ట్ 4 నుండి భార‌త్ – ఇంగ్లండ్ మ‌ధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్ త‌ర్వాత వ‌న్డే, టీ20 సిరీస్‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. నెల రోజుల‌కు పైగా ఇంగ్లండ్-భార‌త్ మ‌ధ్య మ్యాచ్‌లు జ‌ర‌గ‌నుండ‌గా, పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే మ్యాచ్‌లు ప్రారంభం కావ‌డానికి నాలుగు రోజుల ముందు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్ సంచల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

ఇంగ్లండ్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్ గెలవడంలో కీల‌క పాత్ర పోషించాడు. చాలా స‌మ‌యంలో ఇంగ్లండ్ టీం అత‌నిపై ఆధార‌ప‌డింది. అయితే తాను కొన్నాళ్లు ఆటకు విరామం పలకాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ నుంచి నిరవధిక విరామం ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు కొన్నాళ్లు పాటు గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించాడు.

కొన్నాళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ ఆడకూడదని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. మానసిక ఆరోగ్యంతో పాటు ఎడ‌మ‌చేతి చూపుడు వేలుకు అయిన గాయం వ‌ల‌న అత‌ను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఆగస్టు 4 నుంచి భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. సుదీర్ఘమైన ఈ సిరీస్ లో స్టోక్స్ వంటి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ సేవలు కోల్పోవడం ఇంగ్లండ్ జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి.

స్టోక్స్ స్థానాన్ని సోమర్సెట్ ఆల్ రౌండర్ క్రెగ్ ఒవర్టన్ తో భర్తీ చేయనున్నారు. ఐపీఎల్‌కి కూడా స్టోక్స్ దూరం కానున్న‌ట్టు తెలుస్తుంది. సరిగ్గా నాలుగు రోజుల్లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో అతను చేసిన ప్రకటన ఇంగ్లాండ్ జాతీయ జట్టును ఒత్తిడిలోకి నెట్టినట్టయింది.

బెన్ స్టోక్స్ కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతూ వస్తోన్నాడు. క్రికెట్ వ‌ల‌న అత‌ను త‌న ఫ్యామిలీకి పూర్తిగా దూరం కావ‌ల‌సి వ‌స్తుంది. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ , ఈ ఏడాది ఆరంభంలో భారత పర్యటన.. ఆ వెంటనే మళ్లీ ఐపీఎల్ 2021 అది ముగిసిన వెంటనే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్ లను ఆడాడు బెన్. స్ర‌స్తుతం పాక్ ప‌ర్య‌న‌ట‌లో ఉన్నాడు.

రానున్న రోజుల‌లో కూడా నాన్ స్టాప్ షెడ్యూల్ ఉంది. అదీ కాక క‌రోనా ప‌రిస్థితుల వ‌ల‌న క్రికెట‌ర్స్ పూర్తిగా బ‌యోబ‌బుల్ వాతావ‌ర‌ణంలో ఉండ‌ల్సి వ‌స్తుంది. ఒక్కోసారి కుటుంబ సభ్యులకు కూడా దూరం కావాల్సి ఉంటుంది. వాటన్నింటికీ మించి.. గత ఏడాది డిసెంబర్ లో ఇంటి పెద్దను కోల్పోయాడు బెన్ స్టోక్స్. అతని తండ్రి గెడ్ స్టోక్స్ 65 సంవత్సరాల వయస్సులో బ్రెయిన్ కేన్సర్ తో సుదీర్ఘ కాలం పాటు పోరాడుతూ గత ఏడాది డిసెంబర్లో తుదిశ్వాస విడిచారు.

వీట‌న్నింటి వ‌న‌ల బెన్ చాలా మానసిక‌మైన బాధ‌లు ఎదుర్కొంటున్నాడు. మాన‌సిక శారీర‌క ఒత్తిడిని తొల‌గించుకునేందుకు అత‌ను తాత్కాలిక విరామం తీసుకున్నాడు. క‌ష్ట సమయంలో అతనికి బోర్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చాడు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తెలిపాడు. ఎన్ని రోజులైనా అతను విశ్రాంతి తీసుకోవచ్చని ఈ విషయంలో అతనిపై ఎలాంటి ఒత్తిడీ ఉండబోదని హామీ ఇచ్చాడు. తాను మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటే అప్పుడు జట్టులో చేరొచ్చని స్పష్టం చేశాడు.