Radhe Shyam బాహుబలి సినిమాతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ అదే ఉత్సాహంతో సాహో అనే చిత్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోగా, ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ పై ఫ్యాన్స్‌లో ఎన్నో ఆశలు నెలకొన్నాయి. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సమ్మర్లో చిత్రం రిలీజ్ కానున్నట్టు సమాచారం. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు.
యూరోప్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్,టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో రెండు సాంగ్స్, ఒక చిన్న ఫైట్ ఉంటుందట. అలానే సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుండగా, ఇందులోను రెండు సాంగ్స్ ఉంటాయని అంటున్నారు. క్లైమాక్స్ సినిమాకు కీలకం కాగా, దీని కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించి విడుదలైన లుక్ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచింది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అభిమానులకి మాస్త్ థ్రిల్ ఇస్తుందని అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లగా, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామగుండంలో జరుగుతుంది. మరోవైపు నాగ్ అశ్విన్ పీరియాడికల్ చిత్రం కూడా అతి త్వరలోనే మొదలు పెట్టనున్నాడు ప్రభాస్.