బాల‌య్య కూడా అప్‌డేట్ ఇచ్చాడు.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులే లేవు!

మేమంటే మేము అన్న‌ట్టు పోటీ ప‌డి మ‌రి సినిమా రిలీజ్ డేట్‌లు ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఫిబ్ర‌వ‌రి నుండి ఆగ‌స్ట్ వ‌ర‌కు విరామం లేకుండా వ‌రుస సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుండ‌గా, ఇందులో చిన్న‌, పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయితే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇంత‌వ‌ర‌కు రాక‌పోయే స‌రికి ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు.

కొద్ది సేప‌టి క్రితం మూవీ రిలీజ్ డేట్ ఈ రోజు సాయంత్రం 3.36ని.లకు ప్ర‌క‌టిస్తామ‌ని అనౌన్స్ చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ వారు సినిమాని నిర్మిస్తుండ‌గా, థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. బాల‌కృష్ణ 106వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, పూర్ణ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Advertisement