HYPER AADI: వార్త‌ల్లోకి హైప‌ర్ ఆది పెళ్లి.. వ‌ధువు ఎవ‌రో తెలుసా?

HYPER AADI బుల్లితెర పై పసందైన వినోదాన్ని అందించే న‌టీన‌టులు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, హైప‌ర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్త‌లు నిత్యం హెడ్ లైన్స్‌లో ఉంటూనే ఉంటాయి.తాజాగా హైప‌ర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. హైప‌ర్ ఆది త‌న త‌ల్లిదండ్రులు చూపించే అమ్మాయితో వివాహానికి రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆదికి పెళ్లి చేయాల‌ని త‌ల్లిదండ్రులు ఎప్పటి నుండో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వృత్తి రీత్యా ఆయ‌న బిజీగా కావ‌డం వ‌ల‌న కొన్నాళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఇప్ప‌టికే వ‌య‌స్సు చాలా ఎక్కువ కావ‌డంతో మంచి అమ్మాయిని త‌న అర్ధాంగిగా చేసుకోవాల‌ని హైప‌ర్ ఆది అనుకున్నాడ‌ట‌. ఇప్ప‌టికే త‌న స‌న్నిహితులకు పెళ్లి డేట్ కూడా ప్ర‌క‌టించేశాడ‌ట‌. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. కాగా, హైపర్ ఆది పెళ్లి త‌ర్వాత సుడిగాలి సుధీర్.. ర‌ష్మీ గౌత‌మ్‌ని వివాహామాడ‌నున్నాడ‌ని భోగ‌ట్టా.

Advertisement