Anushka shetty : అనుష్క శెట్టికి బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్..?

Anushka shetty : అనుష్క శెట్టి చాలా కాలంగా బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అధికారకంగా ప్రకటించలేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన అనుష్క హిందీలో ఎంట్రీకి మాత్రం డేర్ చేసి ప్రాజెక్ట్ కమిటవ లేకపోతోంది. అనుష్క ఎస్ అనాలేగానీ బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలు భారీ రెమ్యునరేషన్‌తో రెడీగా ఉంటాయి. కానీ ఇంతకాలం అనుష్క ఆ దిశగా ప్రయత్నాలు సాగించలేదు. కాగా ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

crazy offer for anushka-shetty in bollywood
crazy offer for anushka-shetty in bollywood

బాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా సీక్వెల్‌లో అనుష్క నటించే అవకాశాలున్నాయని లేటెస్ట్ న్యూస్ ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున సహా పలువురు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియన్ సినిమాను మూడు భాగాలుగా రూపొందించబోతున్నారు. ఇందులో ఒక పార్ట్‌లో అనుష్కను నటింపచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Anushka shetty : అనుష్క శెట్టి సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఒక రొమాంటిక్ సినిమా చేయనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సినిమాను ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ తెరకెక్కించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే క్రమంలో ‘బ్రహ్మాస్త్ర’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.