MAHESH 28: మ‌హేష్ -త్రివిక్ర‌మ్ మూవీపై ఇంట్రెస్టింగ్ బ‌జ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబిన‌ష‌న్‌లో సినిమా రానుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత రానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిస్తున్నారు. చిత్రంలో. మహేశ్ లుక్ కొత్తగా ఉంటుందనీ, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే పేరు వినిపిస్తుంది.

mahesh babu and trivikram combo movie announced
mahesh babu and trivikram combo movie announced

మహేష్ 28వ సినిమాగా రూపొందున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ లేదు కానీ ఓ టాక్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రానికి భారీగానే బ‌డ్జెట్ కేటాయించ‌నున్నారని స‌మాచారం. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలనేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది.