CPI Narayana And Mega Star Chiranjeevi : చిరంజీవికి ‘అలయ్ బలయ్’లో క్షమపాణ చెప్పిన సీపీఐ నారాయణ.!

NQ Staff - October 7, 2022 / 05:11 PM IST

CPI Narayana And Mega Star Chiranjeevi : చిరంజీవికి ‘అలయ్ బలయ్’లో క్షమపాణ చెప్పిన సీపీఐ నారాయణ.!

CPI Narayana And Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని కొన్నాళ్ళ క్రితం వివాదాస్పద వ్యాఖ్యలతో తూలనాడారు సీపీఐ నారాయణ. అప్పట్లో ఆయన మీద తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. చిరంజీవి అభిమానులు ఆయన్ని ‘బ్రోకర్ నారాయణ’ అంటూ సంబోదించడంతో, బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది.

ఆ దెబ్బకి దిగొచ్చిన నారాయణ, ‘చిరంజీవికి బేషరతు క్షమాపణ చెబుతున్నాను..’ అంటూ చేతులు జోడించి మరీ మీడియా సాక్షిగా నమస్కారం పెట్టి, క్షమాపణ చెప్పారు.

అలయ్ బలయ్ సందర్భంగా ఇంకోసారి క్షమాపణ

తాజాగా హర్యానా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైద్రాబాద్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి – సీపీఐ నారాయణ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా నారాయణ, చిరంజీవితో ముచ్చటించారు.

చిరంజీవితో చేతులు కలిపి, రెండు చేతులూ పట్టుకుని మరీ నారాయణ క్షమాపణ చెప్పారు. ‘అప్పట్లో ఏదో అలా జరిగిపోయింది.. ఆ విషయాల్ని పట్టించుకోవద్దు..’ అంటూ నారాయణ, చిరంజీవిని కోరగా, ‘అస్సలు వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు..’ అని చెప్పారట. దాంతో, నారాయణ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్యా రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చాయి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us