Samantha: కోర్టుకి సామాన్యులైన‌, సెల‌బ్రిటీలు అయిన ఒక‌టే….

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌పై గ‌త కొద్ది రోజులుగా దుష్ప్ర‌చారం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. తాము విడిపోతున్నామంటూ సమంత, నాగచైతన్య దంపతులు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన అనంతరం సుమన్‌ టీవీ, తెలుగుపాపులర్‌ టీవీ, డాక్టర్‌ సీఎల్‌ వెంకట్‌రావులు సమంత పరువుకు నష్టం కలిగించేలా వీడియోలు అప్‌లోడ్‌ చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది.

Court Serious on Samantha for Her Case
Court Serious on Samantha for Her Case

కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో స‌మంత పిటీష‌న్ వేయ‌గా, ఆమె పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సెలబ్రిటీలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ముందు అందరూ సమానమేనన్నారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా కోర్టు ముందు ఒక్కటేనని స్పష్టం చేశారు.

కోర్టు సమయం చివరలో పిటిషన్‌పై విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కాగా, సమాజంలో సెలబ్రిటీగా ఉన్న సమంతను కించపరిచే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని స‌మంత న్యాయ‌వాది పిటీషన్‌లో పేర్కొన్నారు. మీడియా, పత్రికల ద్వారా వారు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

స‌మంత ప్ర‌స్తుతం వెకేష‌న్‌లో ఉంది. విడాకుల ప్రకటన తర్వాత సామ్ మీద ఎన్ని రూమర్స్ వచ్చినా.. అవేమీ పట్టించుకోకుండా కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ గ్యాప్ లో సమంత మానసిక ప్రశాంతత కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోన్నట్లు తెలుస్తోంది.

సమంత తన బెస్ట్ ఫ్రెండ్ ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలసి ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ యాత్రకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హెలీకాఫ్టర్ ముందు సామ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ టేకాఫ్.. మొదట యమునోత్రి కి వెళుతున్నామని వెల్లడించింది.