Court Dismissed Case On Naresh Malli Pelli Movie : మళ్ళీ పెళ్లి విడుదలపై దాఖలైన కేసు కొట్టివేత.. నరేష్ ఇంట్లోకి రాకుండా రమ్య రఘుపతిపై నిషేధం!
NQ Staff - August 2, 2023 / 01:59 PM IST

Court Dismissed Case On Naresh Malli Pelli Movie :
సీనియర్ యాక్టర్ నరేష్ కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురుకు వదిలేసి ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం లోనే గత కొంత కాలంగా ఈ జంట కొన్నాళ్ల పాటు ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే..
గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్న ఈ మధ్యనే వీరు సహజీవనంలో ఉన్నట్టు తెలిసింది. మీడియా ముందు ఇద్దరు వీరి రిలేషన్ ను బయట పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసారు.. అయితే మీడియా ముందు నరేష్ మూడవ భార్య రమ్య చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. ఇప్పటికీ వీరికి విడాకులు అవ్వలేదు.. త్వరలోనే విడాకులు తీసుకున్న తర్వాత నరేష్ పవిత్రను పెళ్లి చేసుకోనున్నట్టు టాక్..
అంతేకాదు నరేష్, పవిత్ర కలిసి మళ్ళీ పెళ్లి సినిమాతో మరో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ జంట తమ బంధంలో జరిగిన విషయాలను బోల్డ్ గా పబ్లిక్ గా వెండితెర మీద సినిమాను తీసుకు రావడం సంచలనమే అని చెప్పాలి.. ఈ సినిమాపై రమ్య రఘుపతి రిలీజ్ పై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..
సినిమాలో ఆమెను నెగిటివ్ గా చూపించారని తన ప్రతిష్ట దెబ్బ తింటుంది అని అందుకే విడుదల ఆపేయాలని పిటిషన్ వేసింది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మళ్ళీ పెళ్లి విడుదలపై దాఖలైన కేసును కొట్టివేసిన సిటీ సివిల్ కోర్టు, నరేష్ ఇంట్లోకి రాకుండా శ్రీమతి రమ్య రఘుపతిపై కూడా నిషేధం విధించినట్టు తెలుస్తుంది..

Court Dismissed Case On Naresh Malli Pelli Movie
ఈ విషయంలో నరేష్ కు కోర్టు ఊరట ఇచ్చినట్టే తెలుస్తుంది.. ఎందుకంటే నరేష్ పవిత్రతో సహజీవనం చేస్తున్నాడు అని బయటకు వచ్చినప్పటి నుండే రమ్య నరేష్ కు మనశ్శాంతి లేకుండా చేసింది. మీడియా ముందు కు ఎంత రచ్చచేసిందో చెప్పాల్సిన పని లేదు.. మరి ఇన్నాళ్లకు రమ్య నుండి నరేష్ కు కోర్టు విముక్తి కలిగించడంతో నరేష్ ఇక పవిత్రను పెళ్లి చేసుకునేందుకు కూడా అడ్డంకులు మెల్లగా తొలగిపోతున్నాయి.. మరి ఈ విషయంలో రమ్య ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి..