IPL2021: ఐపీఎల్ లోను కరోనా కలకలం.. సన్ రైజర్స్ బౌలర్ కి పాజిటివ్ గా నిర్ధారణ

IPL2021: కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఆటగాళ్లను బయోబబుల్ లో ఉంచి పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇంగ్లండ్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ కరోనా వలన ఆగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దుబాయ్ లోను కరోనా కలకలం మొదలైంది.

IPL2021

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌కు కొద్ది గంట‌ల ముందు స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది. అత‌నితో స‌న్నిహితంగా ఉన్న ఆరుగురు ఐసోలేష‌న్‌లో ఉన్నారు. దీంతో బుధ‌వారం రాత్రి ఢిల్లీతో మ్యాచ్ జ‌రుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. టీమ్‌లోని అంద‌రికీ ఆర్టీ పీసీఆర్ ప‌రీక్షలు నిర్వహించారు. అంద‌రి రిపోర్ట్స్ చూసిన త‌ర్వాతే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

గత నవంబర్ లో నటరాజన్ తండ్రైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ సమయంలో అతని భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఈ యార్కర్ల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న నటరాజన్ గతేడాది ఐపీఎల్ లో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్ గా ఎంపికై.. మూడు ఫార్మాట్లలో ఆడి సత్తా చాటాడు. ఐపీఎల్ సమయంలో నటరాజన్ కూతురు జన్మించగా, .. ఆసీస్ టూర్ లో భాగంగా తన బిడ్డకు దూరంగా ఉన్నాడు నటరాజన్.

ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్‌.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు .