Hamsa Nandini: హంసా నందిని కుటుంబానికి క‌రోనా.. 25 రోజులు ఆసుప‌త్రిలోనే

Samsthi 2210 - June 7, 2021 / 03:58 PM IST

Hamsa Nandini: హంసా నందిని కుటుంబానికి క‌రోనా.. 25 రోజులు ఆసుప‌త్రిలోనే

Hamsa Nandini: వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానస్పదం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అందాల బ్యూటీ హంసా నందిని. హీరోయిన్‌గా సక్సెస్ రాకపోవడంతో ఐటం గాల్‌గా మారి సంచలనాలు సృష్టించింది. మిర్చి నుంచి మొదలుపెట్టి దాదాపు 20 సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ అవ‌కాశాల కోసం సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయి ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవ‌ల పచ్చటి ప్రకృతిలో పచ్చ చీరలో హొయలు పోతూ హంసా నందిని చేసిన ఫొటో షూట్ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హంసా నెల రోజులుగా త‌న సోష‌ల్ మీడియాలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌లేదు. దీంతో అనుమానం వ‌చ్చిన నెటిజ‌న్స్ వ‌రుసగా కామెంట్స్ చేశారు.

Hamsa Nandini

హంసా మీకు ఏమైంది, ఎందుకు స్పందించ‌డం లేదు అంటు వంద‌లాది నెటిజ‌న్స్ ఆమెకు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఎట్ట‌కేల‌కు హంసా స్పందించింది. త్రో బ్యాక్ పిక్ ఒక‌టి షేర్ చేస్తూ..కుర్రాళ్లు క్ష‌మించండి. గ‌త 30 రోజులు మా కుటుంబానికి చాలా భ‌యంక‌ర‌మైన రోజులు. నా ఇన్‌బాక్స్ మొత్తం మీ ఆందోళ‌న‌ల‌తో నిండి ఉంది. నేను అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నానేమో అని మీలో చాలా మంది టెన్ష‌న్ ప‌డి ఉంటారు. ప్ర‌స్తుతం క్షేమంగా ఉన్నాను. ఏప్రిల్ 9న నాతో పాటు నా కుటుంబానికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. తక్షణం నేను నా కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాం.

Hamsa Nandini

25 రోజుల చికిత్స త‌ర్వాత నేను నా కుటుంబం కోలుకుంటున్నాం. ఈ విష‌యం తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాను. వైర‌ల్ వ్యాప్తి చాలా ఉదృతంగా ఉంది. ఇంట్లోనే ఉండి మీకు ప్రియ‌మైన వారిని జాగ్ర‌త్త‌గా చూసుకోండి అంటూ హంసా నందిని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.‘ఒకటవుదాం’ అనే సినిమా ద్వారా హంసా నందిని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరవాత వంశీ ‘అనుమానాస్పదం’ సినిమాతో హంసకు గుర్తింపు వచ్చింది. కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ అడ‌పాద‌డపా స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ అల‌రిస్తుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us