RRR: ఆర్ఆర్ఆర్ సినిమా పై కాపీ మ‌ర‌క‌.. రాజ‌మౌళి కాపీ కొట్టాడంటూ ఆరోప‌ణ‌లు

RRR: సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక ప్ర‌తి విష‌యాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ యాంగిల్స్‌లో చూస్తున్నారు. ముఖ్యంగా సినిమాల విష‌యానికి వ‌స్తే నెటిజ‌న్స్ మ‌న సినిమాల‌ను హాలీవుడ్ సినిమాల‌తో పోలుస్తూ త‌ప్పొప్పుల గురించి మాట్లాడుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని ఎల్ల‌లు దాటించిన రాజ‌మౌళి సినిమాల‌పై ఎప్పుడు ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. బాహుబ‌లి సినిమా స‌మ‌యం నుండి మ‌రింత ఎక్కువ‌య్యాయి.

Copy Scenes in RRR Movie Fans Fire on Rajamouli
Copy Scenes in RRR Movie Fans Fire on Rajamouli

బాహుబ‌లి సినిమాలోని చాలా స‌న్నివేశాలు హాలీవుడ్ నుండి కాపీ కొట్టాడంటూ ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటిని పెద్దగా ప‌ట్టించుకోలేదు జ‌క్క‌న్న‌. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ద‌గ్గ‌ర నుండి మొన్న విడుద‌లైన దీస్తి సాంగ్ వ‌ర‌కు కాపీ ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి.

Copy Scenes in RRR Movie Fans Fire on Rajamouli
Copy Scenes in RRR Movie Fans Fire on Rajamouli

ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ లోగో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ లో ఒక సీజన్ టైటిల్ లోగో లాగా ఉంద‌ని, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలో కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాల మాదిరిగానే ఉన్నాయ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేశారు. ఇక ఫ్రెండ్షిప్ డే రోజు విడుద‌లైన దోస్తీ సాంగ్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేతులు పట్టుకుంటారు.

ఇదే మనకు సినిమా పోస్టర్ లో కూడా చూపిస్తారు. . స్టార్ వార్స్ సినిమాలో ఇదే విధంగా చేతులు పట్టుకునే సీన్ ఉంటుంది. దీనిని ఇన్సిపిరేష‌న్ తీసుకొని రాజ‌మౌళి ఈ చిత్రానికి వాడాడా అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఇటీవల విడుదలైన దోస్తీ పాట ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటని తెలుగులో హేమచంద్ర, తమిళ్ లో అనిరుధ్ రవిచందర్, కన్నడలో యాజిన్ నిజార్, మలయాళంలో విజయ్ ఏసుదాస్, హిందీలో అమిత్ త్రివేది పాడారు. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

Copy Scenes in RRR Movie Fans Fire on Rajamouli
Copy Scenes in RRR Movie Fans Fire on Rajamouli

ఈ పాటలో పరస్పర విరుద్ధమైన రెండు ప్రకృతి శక్తులను లేదా అంశాలను పోల్చిచూపడం పోటీపెట్టడం ఆకట్టుకుంటుంది.కాని ఇద్దరు మిత్రులు సమవుజ్జీలు చైతన్యవంతులూ అయినప్పుడు పాటలోని పదాలు ఎలా పొసుగుతాయనే సందేహం వేస్తుంది .విలుకాడు,ఉరితాడు,విధిరాత, మేఘం వంటివాటికి పోటీ సహజంగా లేదు.కొన్ని ఖచ్చితంగా నిలవవు. పైగా పాటలో జ్వాలలు చాలా వున్నాయి.ఈ ప‌దాలు పాత్ర‌ల‌కు స‌రిగ్గా సింక్ కావ‌ట్లేద‌ని కొంద‌రు చెబుతున్నారు.