EMK: కోటి గెలుచుకున్న కంటెస్టెంట్‌కి చేతికి వ‌చ్చే మొత్తం ఎంతో తెలుసా?

EMK: నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో తొలిసారి సుజాత నగర్‌కు చెందిన భాస్కర రాజా రవీంద్ర అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. బీటెక్, ఎంఏ, ఎల్ఎల్‌బీ చదివిన రవీంద్ర 2012లో పోలీస్ శాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని సర్కిల్ ముత్తారం పీఎస్‌లో సబ్ ఇన్స్పెక్టర్‌గా డ్యూటీలో జాయిన్ అయ్యారు. 2015 నుంచి హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు.

Cop creates history in emk
Cop creates history in emk

ఇప్పటి వరకు కోటి రూపాయలు ఎవ్వరూ దక్కించుకోలేదు. తాజాగా కొత్తగూడెం ప‌ట్టణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్టర్ రాజార‌వీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొని చ‌రిత్ర సృష్టించాడు. ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు రాజారవీంద్ర సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయ‌లు గెలుచుకున్నారు. రాజారవీంద్ర ప్రైజ్ మ‌నీ గెలిచిన ఎపిసోడ్ ఇటీవల ప్రసారం అయింది.

అయితే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్నా రాజార‌వీంద్రకు చేతికి దక్కేది మాత్రం తక్కువే. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గెలిస్తే వాళ్ళు కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా షోలో గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి‎‎ చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Cop creates history in emk1
Cop creates history in emk1

ప్రైజ్ మనీ ఇచ్చేటప్పుడు టీవీలో చెక్ మీద కోటి రూపాయలు చూపించినా తర్వాత మాత్రం పన్ను మినహాయించి మిగిలిన డబ్బులు చెల్లిస్తారు. అంటే ‘‎‎ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి రూపాయలు గెలిస్తే విజేతకు వచ్చేది రూ.68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000 పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది.

రాజారవీంద్ర ఖమ్మం జిల్లాకి చెందిన వ్యక్తి. ఈయనకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్‌ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. రాజా రవీంద్ర ఇదివరకు సాఫ్ట్‌వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత 2012లో పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన లక్ష్యం అని ఆయన తెలిపారు.