అయోమయంలో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ ..అనవసరంగా కమిటయ్యారా ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో రెండు నెలలైతే ఈ సినిమా మొదలై దాదాపు సంవత్సరం పూర్తి కావస్తుంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉండటం తో సినిమా అనుకున్న సమయానికి పూర్త్ కాలేదు. దానికి తోడు కరోనా భారీగా దెబ్బ కొట్టి దాదాపు 7 నెలలు షూటింగ్స్ అన్ని లాక్డ్ డౌన్ అయ్యేలా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ మంచి దూకుడుగా వకీల్ సాబ్ తో పాటు మరో 5 ప్రాజెక్ట్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు.

Vakeel Saab Motion Poster: Pawan Kalyan looks ready to bring on justice |  Telugu Movie News - Times of India

అయితే గత సార్వత్రిక ఎన్నికలలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం వల్ల మళ్ళీ ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో జనసేన అధినేత రెండు పడవల మీద ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేశాడు. మరో వారం రోజులు షూటింగ్ లో పాల్గొంటే వకీల్ సాబ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో కూడా సినిమా మొదలై 15 రోజుల షెడ్యూల్ కంప్లీట్ అయింది. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా లో జాయిన్ కావాల్సిన పవన్ కళ్యాణ్.. ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ కార్యకలాపాలు చూస్తున్నారు.

అయితే ఏ సినిమా కూడా షూటింగ్ సజావుగా సాగడం లేదన్న మాట వినిపిస్తోంది. ప్రజల కోసం రాజకీయాలలోకి వచ్చిన పవన్ అభిమానుల కోసం సినిమాలు చేస్తుండటం బాగానే ఉన్నప్పటికి ఇప్పుడు నిర్మాతలు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోందట. ప్రస్తుతం తెలంగాణాలో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. అలానే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ బై ఎలక్షన్ కూడా త్వరలోనే రాబోతోంది. బీజేపీ కూటమితో కలిసి ప్రయాణిస్తున్న జనసేన పార్టీకి తిరుపతిలో పోటీ చేస్తాడని అంటున్నారు.

ఈ కారణంగా పవన్ కళ్యాణ్ నటించాల్సిన సినిమా షూటింగ్స్ అన్ని తారుమారవుతున్నాయని అంటున్నారు. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ కోసం చాలా తక్కువ డేట్స్ ఇచ్చి సినిమా ఫినిష్ చేయాలనుకున్నాడు. ఇక క్రిష్ ..హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డి తో పాటు బండ్ల గణేష్ నిర్మాణం లో తెరకెక్కాల్సిన సినిమాల పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. మరి వీటన్నికిటికి పవర్ స్టార్ ఎప్పుడు చెక్ పెడాతారో చూడాలి.

Advertisement
Advertisement