Biggboss 5: కాజ‌ల్‌కి మిడిలి ఫింగ‌ర్ చూపించిన లోబో.. క‌ట్ చేస్తాన‌న్న ప్రియాంక‌

Biggboss 5: సోమవారం నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా హాట్ హాట్‌గా సాగింది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అయితే హౌజ్‌లో ఇప్పుడు కొన్ని గ్యాంగ్‌లు ఏర్ప‌డ్డాయి. ఆ గ్యాంగ్‌లో ఒక‌రిని ఏమ‌న్నా మిగ‌తా వారు కూడా యాంగటీ అయిపోతున్నారు. శ్రీరామ్‌.. జెస్సీని ఫుడ్ వండుకోవాల‌ని చెప్పిన నేప‌థ్యంలో జెస్సీ గ్యాంగ్‌లో ఉన్న‌ష‌ణ్ను, సిరిలు శ్రీరామ్‌కి వ్య‌తిరేఖంగా మారారు.

Clashes Between RJ Kajal and Lobo in Biggboss 5
Clashes Between RJ Kajal and Lobo in Biggboss 5

మొత్తంగా ఈ గొడవతో అటు సిరి, షణ్ను, జెస్సీ, ఇటు శ్రీరామ్‌, హమీదా ఏమీ తినకుండా ఫుడ్‌ మీద తమ ప్రతాపాన్ని చూపించారు. అయితే నీకు ఆకలేస్తే తినంటూ శ్రీరామ్‌ హమీదాను బుజ్జగించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో పస్తులతోనే పడుకున్నారు. త‌ర్వాతి రోజు టిఫిన్ బాగా కుమ్మేసారు. అనంతరం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌లో భాగంగా పలువురు ఇంటిసభ్యులు వారి ఫ్యామిలీకి బహుమతులను అందించే అవకాశాన్ని కొట్టేశారు.

Clashes Between RJ Kajal and Lobo in Biggboss 5
Clashes Between RJ Kajal and Lobo in Biggboss 5

కెప్టెన్‌ శ్రీరామ్‌.. ప్రియ, షణ్ముఖ్‌, హమీదా, మానస్‌లను ఎంచుకున్నాడు. మొదటగా ప్రియ.. తన తల్లికి టీవీని బహుమతిగా ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. తర్వాత షణ్ముఖ్‌.. డైరెక్టర్‌ సుబ్బుకు ల్యాప్‌టాప్‌ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. మానస్‌.. తన తల్లికి బ్రాండెడ్‌ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వెల్లడించాడు. హమీదా.. తన తల్లికి లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తున్నట్లు తెలిపింది.

Clashes Between RJ Kajal and Lobo in Biggboss 5
Clashes Between RJ Kajal and Lobo in Biggboss 5

ఇక రవి, కాజల్‌ మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. నెల రోజుల నుంచి లోబో, రవి వాష్‌రూమ్‌ క్లీనింగ్‌ తప్ప కిచెన్‌ వంకే చూడట్లేదని సెటైర్‌ వేసింది కాజల్‌. దీంతో ర‌వికి ఒళ్లు మండ‌డంతో మ‌జాక్ అనేది కొంత వ‌ర‌కే ఉంటే బాగుంటుంద‌ని ర‌వి ఫైర్ అయ్యాడు. లోబో అయితే ఏకంగా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఆమెకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో లోబో చేసింది తప్పని వాదించింది కాజల్‌.

కాజ‌ల్ ఈ విష‌యాన్ని పింకీతో షేర్ చేసుకోగా, త‌న‌కు అలా వేలు చూపిస్తే క‌ట్ చేసి ప‌డేస్తాన‌ని చెప్పింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో హింసకు తావు లేనందున అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేశానంది కాజల్‌. నెల రోజులన నుంచి కిచెన్‌లో తానేమీ పని చేయలేదని ఎలా స్టేట్‌మెంట్‌ ఇస్తావని కాజల్‌ను నిలదీశాడు రవి. దీంతో మాట మార్చిన కాజల్‌.. కేవలం మీకు కిచెన్‌ డ్యూటీ రాలేదని మాత్రమే అన్నానని కవర్‌ చేసింది.

ర‌వి, కాజ‌ల్‌,మాన‌స్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌ను కెప్టెన్‌గా ఉన్న శ్రీరామ్ స‌ద్దుమ‌ణిగేలా చేశాడు. కాని అత‌ని వ‌ల‌న కూడా కాలేదు. తర్వాత బిగ్‌బాస్‌.. ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా ఇంటి సభ్యులు ప్రజలుగా వ్యవహరిస్తారు.

ఇద్దరు రాకుమారులు వారి దగ్గరున్న ధనాన్ని టాస్క్‌లతో పాటు సేవలు చేయించుకోవడానికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. టాస్క్‌ పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్లు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని అందుకుంటారు.

దీంతో రవి, సన్నీ సపోర్ట్‌ కోసం హౌస్‌మేట్స్‌ వెంట పడ్డారు. ఈ క్రమంలో యాంకర్‌ రవికి విశ్వ, శ్రీరామ్‌, హమీదా, శ్వేత, యానీ మాస్టర్‌ సపోర్ట్‌ చేయగా.. సన్నీకి మానస్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ప్రియ, సిరి, షణ్ముఖ్‌, జెస్సీ మద్దతుగా నిలబడ్డారు. తర్వాత సడన్‌గా సిరి.. రవి గ్యాంగ్‌లో జాయిన్‌ అయిపోయింది. అయితే ఖజానాలో నుంచి నాణాలు పోయాయని గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చేతగానోళ్లు చేసే పనులంటూ చీదరించుకున్నాడు.

తర్వాత బిగ్‌బాస్‌ ప్రవేశపెట్టిన ‘మట్టిలో మహాయుద్ధం’ అనే కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్‌; సన్నీ వైపు నుంచి మానస్‌, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి. మ‌రి ఈ టాస్క్ విజేత ఎవ‌ర‌న్న‌ది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది.