TOLLYWOOD: ఇద్ద‌రు సెల‌బ్రిటీల మ‌ధ్య గొడ‌వ‌.. 15 ఏళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ్డ అసలు నిజం..!

ఇండ‌స్ట్రీలో పొర‌ప‌చ్చాలు ఏర్ప‌డ‌డం కామ‌న్‌. కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రి కొన్ని అలానే దాగి ఉంటాయి. అయితే 15 ఏళ్ల క్రితం ఎంఎస్ రాజు, ప్ర‌భుదేవా మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌కు సంబంధించిన విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2006లో విడుదలైన పౌర్ణమి సినిమా ఫ్లాప్ కాగా, ఈ సినిమా విష‌యంలో ప్ర‌భుదేవా, ఎంఎస్ రాజు మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగిన‌ట్టు అప్ప‌ట్లో పుకార్లు షికారు చేశాయి. దీనిని ఎవ‌రు ఖండించ‌క‌పోవ‌డంతో అవి రూమ‌ర్స్‌గానే ఉన్నాయి. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు అప్ప‌ట్లో వ‌ర్షం, మ‌న‌సంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు నిర్మించ‌డంతో ఆయ‌న మంచి టేస్ట్ ఉన్న నిర్మాత‌గా అంద‌రిచే గుర్తించ‌డ‌బ‌డ్డారు.


ఎంఎస్ రాజు మంచి రచయిత కాగా, ఆయన సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా అందించేవారు. ఒక్కోసారి దర్శకత్వ విభాగంలో జోక్యం చేసుకుంటాడని కూడా విమర్శలు ఉండేవి. అయితే ఉంటే సుమంత్ ఆర్ట్స్ బ్యానర్కు సక్సెస్ రేటు ఎక్కుగా ఉండేది కాబట్టి.. ఆ విమర్శలను అప్పట్లో ఎవరూ పట్టించుకొనేవారు కాదు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో అంతకు ముందు వచ్చిన నువ్వొస్తానంటే నెనొద్దాంటానా చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో మరో సినిమా తీయాలని ఎంఎస్ రాజు భావించారు. ఈ క్ర‌మంలో పౌర్ణమి చిత్రం పట్టాలకెక్కింది. ఇందులోని పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి.

పౌర్ణ‌మికి ముందు ప్ర‌భాస్‌కు ఛ‌త్ర‌పతి వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్కింది. పౌర్ణ‌మి సినిమా కొంత లేడి ఓరియెంటెడ్ మూవీగా ఉండ‌డంతో ప్రభాస్ అభిమానుల‌ని తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చింది. ఆడియో హిట్టైన కూడా సినిమా ఫ్లాపైంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టే స‌రికి ఎంఎస్ రాజు.. దర్శకుడు ప్రభుదేవా మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తమ మధ్య ఎటువంటి గొడవ జరగలేదని.. ఇప్పటికీ తాము ఫ్రెండ్లీగానే ఉంటామని చెప్పాడు. దీంతో గ‌త 15 ఏళ్లుగా ఉన్న రూమ‌ర్‌కి ఇంత‌టితో చెక్ ప‌డింది.