Harish Shankar: ర‌చ్చ‌గా మారిన హ‌రీష్ శంక‌ర్ , జ‌ర్న‌లిస్ట్ మ‌ధ్య చ‌ర్చ‌.. !

Harish Shankar: మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సోష‌ల్ మీడియా ద్వారా ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రీసెంట్‌గా హ‌రీష్ శంక‌ర్.. సాయి తేజ్ యాక్సిడెంట్‌పై త‌ప్పుడు వార్త‌లు రాసేవారిని ఎండ‌గ‌ట్టారు.

Conflict between director harish shankar and journalist
Conflict between director harish shankar and journalist

హాట్సాఫ్ తమ్ముడు సాయి ధరమ్ తేజ్. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను” అని పేర్కొంటూ హరీష్ ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు కొంద‌రు హరీష్ పెట్టిన పోస్ట్‌ని సపోర్ట్ చేస్తున్నారు.


హ‌రీష్ శంక‌ర్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన దొంతు రమేశ్.. ‘‘మీడియా వాళ్లను విమర్శించడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు, కథనాలు, హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరేమో కోట్లు సంపాదించుకుంటారు. మమ్మల్నేమో తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు. అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురవ్వడమే కాదు.. ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు.


దానికి మళ్లీ హరీశ్ బదులిచ్చారు. తమ సినిమాల్లో హింసపై ఆన్సర్ చేసేందుకు తమకు సెన్సార్ బోర్డుందని, తాము దానికి జవాబుదారీగా ఉంటామని చెప్పారు. మరి, మీడియా దేనికి జవాబుదారీగా ఉందో చెబుతారా అని ప్రశ్నించారు. తాను మీడియా వ్యవస్థ గురించి మాట్లాడట్లేదని, ఆ వ్యవస్థను తప్పుదోవ పట్టించేవాళ్ల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. దయచేసి సమస్యను అర్థం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.


దానికి బదులిచ్చిన దొంతు రమేశ్.. తాము జనానికి జవాబుదారులమని చెప్పారు. జర్నలిస్టుగా ప్రశ్నించే గొంతునన్నారు. సెన్సార్ సభ్యుడిగా సెన్సార్ ఎలా చేస్తారో తనకు తెలుసని ఆయన కౌంటర్ ఇచ్చారు. నేను “ తప్పుడు వార్తలు “అని క్లియర్ గా మెన్ష‌న్‌ చేశాను కదా మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు … అంటే … ఒప్పుకున్నట్టేనా ? మీ క్లారిటీకి ధ‌న్య‌వాదాలు అని పేర్కొన్నారు.


అలానే సెన్సార్ మెంబ‌ర్‌గా చేశా అంటున్నారు కదా , ఈ సినిమా లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం నిజం కాదు అని మేము వేస్తాం ; మీరూ న్యూస్ ముందు ఇదంతా నిజం కాదు కేవలం మా ఛానెల్‌ కల్పితం అని వేయండి మరి ! జనాలకి ఒక క్లారిటీ ఉంటది !! లేదా సినిమాల‌ని, న్యూస్‌ల‌తో కంపేర్ చేయడం ఆపండ‌ని అన్నాడు హ‌రీష్‌.