Jhansi : కండక్టర్‌ ఝాన్సీ కి సినిమాలో ఐటం సాంగ్ ఆఫర్‌.. ఇచ్చింది ఎవరో తెలుసా!

NQ Staff - September 17, 2022 / 10:16 AM IST

Jhansi : కండక్టర్‌ ఝాన్సీ కి సినిమాలో ఐటం సాంగ్ ఆఫర్‌.. ఇచ్చింది ఎవరో తెలుసా!

Jhansi : శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయినా కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది అనడంలో సందేహం లేదు. ఆమె గతంలో స్టేజ్ పై వేసిన డాన్సులు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో వేసిన డాన్సులు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆమె వీడియోలు.. ఇంటర్వ్యూలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె రియల్ లైఫ్ స్టోరీ కన్నీళ్లను పెట్టిస్తుంది.

Conductor Jhansi got Item song offer

Conductor Jhansi got Item song offer

ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ సమయంలో ఆమెను సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ గా విమర్శిస్తున్నారట.. తన భర్తను దుర్భాషలాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తట్టుకోని నిలబడుతున్న కండక్టర్ ఝాన్సీ కి సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశం వచ్చింది. ఏకంగా ఒక సినిమాలో ఐటం సాంగ్ చేసే అవకాశం కండక్టర్ ఝాన్సీ దక్కించుకుంది.

సంపూర్ణేష్ బాబు హీరో గా రుపొందుతున్న సినిమాలో కండక్టర్ ఝాన్సీకి ఐటం సాంగ్ చేసే అవకాశం ఫిలిం మేకర్స్ ఇచ్చారట.స్వయంగా సంపూర్ణేష్ బాబు ఫోన్ ద్వారా కండక్టర్ సంప్రదించాడని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కండక్టర్ ఝాన్సీ డాన్సులో మంచి ప్రతిభ కలిగిన వ్యక్తి, అందుకే ఆమెతో ఐటం సాంగ్ చేయించడం ద్వారా తమ సినిమాకు మంచి క్రేజ్‌ దక్కుతుంది అనే ఉద్దేశంతో చిత్ర సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో కండక్టర్ ఝాన్సీ కి కూడా కెరియర్ లో చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. సంపూర్ణేష్ బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేసి సక్సెస్ అయితే కండక్టర్ ఝాన్సీ సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి ఐటం సాంగ్ లతో కండక్టర్ ఝాన్సీ ముందు ముందు టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతుందా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us