NTR: ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా ప‌క్కా.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

NTR: ఉప్పెన సినిమాతో అందరిని అల‌రించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా మారి ఉప్పెన అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మెగా హీరో, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యారు.

coming soon ntr next movie1
coming soon ntr next movie1

అలాగే హీరోయిన్ కృతిశెట్టి కూడా పరిచయం అయ్యింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా వందకోట్లకు పైగా వసూలు చేసింది. డెబ్యూ హీరో సినిమా వందకోట్లు సాధించడం నిజంగా రికార్డే..

సుకుమార్‌కు తారక్‌కు మంచి స్నేహం ఉంది. అలాగే బుచ్చిబాబుకు కూడా తారక్‌తో మంచి చనువు ఉంది. ఈ క్రమంలో బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. ఇక బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమా తర్వాత తన సినిమాను అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం తారక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

coming soon ntr next movie
coming soon ntr next movie

త్వ‌ర‌లోనే ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది . ఇటీవల ఓ ఇంట్రవ్యూలో బుచ్చిబాబును మీ తర్వాత సినిమా తారక్ తోనేనా..? అని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. అదే సమయంలో ఓ పెద్ద హీరోతో సినిమా కోసం ఒక ప్రాంతీయ కథను సిద్దం చేసినట్లుగా కూడా బుచ్చి బాబు చెప్పాడు.