comedy stars : ఫేడవుట్ హీరోయిన్లతో కొత్త షోలు.. అసలేం జరుగుతోంది?

Comedy Stars vs Sridevi Drama Company Show
Comedy Stars vs Sridevi Drama Company Show

comedy stars  : ప్రస్తుతం బుల్లితెర స్టాండర్స్ పెరిగాయి. బుల్లితెర స్థాయి పెరగడంతో కొత్త కొత్త షోలు ఎక్కువగా వస్తున్నాయి. సినిమాల్లో వచ్చే ఎంటర్టైన్మెంట్ కంటే బుల్లితెరపై వచ్చే ఫన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరూ కూడా బుల్లితెర వైపే చూస్తున్నారు. అందులో వచ్చే ఎంటర్టైన్మెంట్ షోలు కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా బుల్లితెర మాత్రం అందరినీ ఆకట్టుకోవడంలో సఫలం అవుతోంది.

ఇప్పుడు బుల్లితెరపై కొన్ని చానెళ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కామెడీ షోలతో ఢీ అంటే ఢీ అని పోటీ పడేలా రెడీ అవుతున్నారు. ఇప్పుడు స్టార్ మా, ఈటీవీల్లో రెండు కొత్త షోలు ప్రారంభం కాబోతోన్నాయి. ఈటీవీలో శ్రీదేవీ డ్రామా కంపెనీ రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఇది వరకే ప్రోమోలతో రచ్చ చేశారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ప్రోమోను నేడు విడుదల చేయడంపైనా ఓ లెక్కుంది.

స్టార్ మా వాళ్లు కామెడీ స్టార్స్ అంటూ ఓ ప్రోమోను వదిలారు. తమ నుంచి కొత్త షో రాబోతోందంటూ చెబుతూ వదిలిన ఈ ప్రోమో బాగానే వైరల్ అయింది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, నాటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ ఇలా ఎంతో మందిని తీసుకొచ్చారు. అలా ఇప్పుడు స్టార్ మా కామెడీ స్టార్స్ ట్రెండింగ్‌లోఉండటం చూసి మల్లెమాల నుంచి మరో ప్రోమోను దింపారు. అలా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఫేడవుట్ హీరోయిన్లతో..
అయితే ఈరెండు కొత్త షోల్లో ఒకటి కామన్‌గా కనిపిస్తోంది. ఫేడవుట్ అయిన హీరోయిన్లను ఇలా కొత్త షోల్లోకి పిలుస్తున్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో హీరోయిన్ రేఖ, సంగీత ను తీసుకున్నారు. ఇక కామెడీ స్టార్స్‌లో ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను హీరోయిన్ శ్రీదేవి ని తీసుకొచ్చారు. మరి వీరిలో ఎవరు క్లిక్ అవుతారు.. ఏ షో నిలుస్తుందో చూడాలి. అయితే ఈ రెండు కూడా ఆది వారం మధ్యాహ్నం సమయంలోనే ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.

Advertisement