Comedy kings: ఒకే వేదిక‌పై లెజెండ‌రీ క‌మెడీయ‌న్స్ సంద‌డి.. టీజ‌ర్ అదిరింది..!

Comedy kings: బుల్లితెరపై క్రేజీ షోస్‌లో ఆలీతో సరదాగా ఒకటి. ఈ వేదికగా సెలబ్రిటీలతో సరదాగా ముచ్చటిస్తూ ప్రేక్షకుల కావాల్సిన సమాచారాన్ని లాగుతుంటారు కమెడియన్ ఆలీ. సీనియర్, జూనియర్ అనే తేడాలేకుండా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేస్తూ వారి వారి పర్సనల్ విషయాలు రాబట్టడం ఆలీ స్టైల్. మరి ఇలాంటి వేదికపై లెజండరీ కమెడియన్ బ్రహ్మానందం సందడి చేస్తే ఎలా ఉంటుంది.

TheNewsQube-
comedy kings are back3
comedy kings are back3

తాజాగా ఆలీతో సరదాగా షోకి బ్ర‌హ్మానందం హాజ‌రుకాగా, ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఈ వీడియోలో ఆలీ, బ్రహ్మానందం ఇద్దరూ కలిసి కాలు కడపడంతో బుల్లితెర ప్రేక్షకలోకం ఫిదా అయింది. కింగ్ ఆఫ్ కామెడీ అంటూ బ్రహ్మానందంకు సాదర స్వాగతం పలికారు ఆలీ. దీంతో ఇన్నాళ్లుగా ఎంతోమంది చేస్తున్న రిక్వెస్టులకు మోక్షం కలిగింది. లెజండరీ కమెడియన్లు ఆలీ, బ్రహ్మానందంలను ఒకే తెరపై చూసి ప్రేక్షకలోకం హుషారెత్తిపోతోంది.

ఈ షోలో పాపారాయుడు పాటకు బ్రహ్మానందం, ఆలీ కలిసి స్టెప్పులేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 44 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఫుల్ ఎపిసోడ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సరకులతో పాటు మీనాన్న తాడు కూడా కొనేవారట అని అలీ..బ్ర‌హ్మానందంని ప్ర‌శ్నించ‌గా, ఊరుకోవయ్యా . మేము ఎనిమిది మంది పిల్లలం. ‘ఒరేయ్‌ నాన్న పిలిచాడురా’ అని ఎవరైనా అంటే ‘ఓహో ఎవర్ని’ ‘ఐదో నంబరు’ ఇక వాడు వెళ్లిన తర్వాత ఆర్‌ఆర్‌ మ్యూజిక్‌ తప్ప మరొకటి వినిపించేది కాదు. మిమ్మల్ని నవ్వించడానికే ఈ ఏడుపు అని చెప్పుకొచ్చారు బ్ర‌హ్మానందం.

comedy kings are back1
comedy kings are back1

జంధ్యాల గారు నన్ను చిరంజీవి గారికి పరిచయం చేస్తూ ‘ఈయన బ్రహ్మానందం. కాలేజీ లెక్చరర్‌ అని చెబుతారండీ. ఎంతవరకూ నిజమో తెలియదు’ అని అన్నారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయాలన్నీ చిరుతో చెబుతుంటే ‘మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు సినిమాల్లో ఎలా నటించాలో నేను చూసుకుంటా’ అని చిరు అన్నారు. మొదటిసారి విమానం ఎక్కింది ఆయనతోనే అని బ్ర‌హ్మానందం చెప్పారు.