పుష్ప సినిమాలో ఈ కామెడీ విలన్ ఉన్నాడా ..?

రీసెంట్ గా మొదలైన పుష్ప సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా కోసం కంప్లీట్ మాసీగా తయారయ్యారు. తన మేకోవర్ తోనే ప్రేక్షకులను, మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇలాంటి క్యారెక్టర్ చేయకపోవడంతో అందరికి ఆతృతగా ఉంది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా కావడం.. భారీ బడ్కెట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie  News - Times of India

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో విలన్ పాత్ర కి మంచి కామెడి టైమింగ్ ఉన్న సునీల్ ని ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ కన్‌ఫర్మేషన్ అయితే లేదు గాని ప్రస్తుతం సునీల్ పేరు మాత్రం బాగా ప్రచారంలో ఉంది.

మొదట మంచి కామెడీ పాత్రలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిన సునీల్ ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసందే. హీరోగా మూడు – నాలుగు సినిమాలు హిట్ అయినప్పటికి ఆ తర్వాత సునీల్ నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో మళ్ళీ కమెడియన్ గా మారి ఫాం లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు విలన్ పాత్రల్లో కూడా కనిపిస్తున్నాడు. రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్ గా కనిపించిన సునీల్ రీసెంట్ గా ‘కలర్ ఫొటో’లోనూ విలన్ గా కనిపించాడు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో కూడా ఒక నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం.

Advertisement