Priyadarshi: క‌మెడీయ‌న్ ప్రియ‌ద‌ర్శి స‌తీమ‌ణి ఎవ‌రో తెలుసా?

Priyadarshi: టాలీవుడ్ ప్ర‌ముఖ కమెడీయ‌న్స్‌లో ప్రియ‌ద‌ర్శి ఒక‌రు. పెళ్లి చూపులు సినిమాతో పాపులారిటీ ద‌క్కించుకున్న ప్రియ‌ద‌ర్శి . ‘మల్లేశం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియదర్శి ఈ మధ్యే వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. ప్రియ‌ద‌ర్శి ఒకవైపు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూనే మ‌రో వైపు ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషిస్తున్నాడు. ప్ర‌స్తుతం క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కుతున్న‌ ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ ది గాడ్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. విద్యాసాగర్‌ ముత్తు కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను బాషా, మాస్టర్‌, డాడీ చిత్రాల దర్శకుడు సురేశ్‌ కృష్ణ నిర్మిస్తున్నాడు. వెబ్‌ సిరీస్‌లోని కీలకమైన సన్నివేశం షూట్‌ చేస్తున్న సమయంలో అత‌ని కాలికి గాయం కాగా, దీని నుండి కోలుకోవడానికి మూడు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌.

Priyadarshi

ఎంతో అంకిత భావంతో ప్రియ‌ద‌ర్శి సినిమాలు చేస్తుండ‌గా, ఆయ‌న‌కు యూత్‌లోను మంచి క్రేజ్ ఉంది. 2018 లో ఇతను రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వివాహానికి ఇండ‌స్ట్రీ నుండి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. రిచా శర్మ నార్తిండియన్ అమ్మాయి కాగా, ఆమె కోసం ఓ ప్రేమ లేఖ రాసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అప్ప‌ట్లో ఈ ప్రేమ లేఖ అంద‌రిని ఆకర్షించింది. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ప్రేమ లేఖ రాసి త‌నకి కాబోయే స‌తీమ‌ణిని ప‌రిచ‌యం చేశాడు.

Priyadarshi

`డియ‌ర్ ల‌వ్‌.. నీ ప‌ట్ల నా ప్రేమ‌ను, ఆలోచన‌ల‌ని పదాలుగా మార్చి రాయాలనుకోగా, అది జరగలేదు. నీ హృదయం గురించి రాయడానికి కచ్చితంగా లక్షల కొద్దీ పదాలు,పద్యాలు కావాలి. జీవిత కాలంలో ప్రతి రోజు, ప్రతీ క్షణం వాటి కోసమే ప్రయత్నిస్తున్నా. నిన్ను నా జీవితంలోకి తీసుకు వచ్చిన విధికి నా ధన్యవాదాలు చెప్పడం తప్ప మరేం చేయలేను. స్నేహాన్ని, ప్రేమని పండుగలా జరుపుకుందాం. ప్రేమకు నిర్వచనంలా నిలుద్దాం. పుట్టిన రోజు శుభాకాంక్షలు రిచా. మై డార్లింగ్ వేలంటైన్‌.. నిన్ను ప్రేమించ‌డం కంటే నాకు ఇంక ఏదీ ఎక్కువ కాదు` అని ప్రియ‌ద‌ర్శి తన ప్రేయసికి ప్రేమ‌లేఖ రాశాడు. అది అప్ప‌ట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.