Comedian Ali : అలీకి ఉన్న ఈ వైకల్యం గురించి తెలుసా.. ఇన్ని కష్టాలు పడ్డాడా..?
NQ Staff - February 18, 2023 / 01:20 PM IST

Comedian Ali : సినీ రంగంలో రాణిస్తే వారు అందరికీ ఒక స్టార్ గా కనిపిస్తారు. చూసే వారికి లైఫ్ అంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. కానీ వారు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారనే విషయం మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. తెర మీద అందంగా కనిపించిన వారంతా.. తెరవెనక ఎంత కష్టపడుతారనే విషయం చాలామందికి తెలియదు. ఇలాంటి వారిలో కమెడియన్ అలా కూడా ఒకరు.
ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కమెడియన్ అలీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా, హీరోగా ఇలా చాలా రకాత పాత్రల్లో ఆయన నటించి మెప్పించాడు. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు.
నత్తి ఉండటంతో..
ఇప్పుడు వైసీపీ లీడర్ గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అయితే అలీకి ఓ వైకల్యం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయనకు కొంచెం నత్తి ఉంది. మాట్లాడే సమయంలో కొన్ని సార్లు మాట తడ బడుతుంది.
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయన ఈ నత్తి కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ తన వైకల్యాన్ని దాటుకుని రాత్రిళ్లూ కష్టపడి సక్సెస్ అయ్యాడు. ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. సాధించాలనే తపన ఉండాలే గానీ.. వైకల్యాలు పెద్ద సమస్య కాదని నిరూపించాడు అలీ.