Ali: ఎఫ్3 టీంకి బిర్యానీ ట్రీట్ ఇచ్చిన అలీ.. ఎందుకో తెలుసా?

Samsthi 2210 - July 31, 2021 / 04:13 PM IST

Ali: ఎఫ్3 టీంకి బిర్యానీ ట్రీట్ ఇచ్చిన అలీ.. ఎందుకో తెలుసా?

Ali: గ‌త ఏడాది క‌రోనా వ‌లన సినిమా షూటింగ్స్ దాదాపు తొమ్మిది నెల‌లు ఆగిన సంగ‌తి తెలిసిందే. ఇక సెకండ్ వేవ్ లో మూడు నెల‌ల‌కు పైగా షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ షూటింగ్స్ ఊపందుకున్నాయి. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి త‌మ సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు ద‌ర్శ‌క నిర్మాతలు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో బాగా న‌వ్వులు పంచిన చిత్రం ఎఫ్ 2 కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 రూపొందుతుంది.

Ali

వ‌రుణ్ తేజ్,వెంక‌టేష్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు అనీల్ రావిపూడి త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నాడు. అయితే సినిమా యూనిట్ మొత్తం సరదాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. మెల్లిగా మళ్లీ నవ్వులు మొదలు అంటూ ఎఫ్ 3 మూవీ షూటింగ్ ప్రారంభమైనట్టు యూనిట్ తెలిపింది.

ఇక అదే నవ్వులను కొనసాగిస్తూ యూనిట్ దూసుకెళ్తోన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఓ పోస్ట్ చేశారు. చిత్రంలో ఆలీ ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, షూటింగ్ కోసం సెట్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో త‌న ఇంట్లో ప్ర‌త్యేకంగా త‌యారు చేయించి బిర్యానీ తీసుకొచ్చాడు. ఆలీ.. వీకెండ్ సందర్భంగా అందరికీ ట్రీట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Ali

ఆలీ తెచ్చిన బిర్యానీతో టీం అంద‌రు క‌లిసి ఫొటో దిగ‌గా, ఇందులో అనీల్ రావిపూడి త‌న చేతిని ఆలీ వైపు చూపిస్తూ ఇతనే బిర్యానీ తెచ్చాడు అన్నట్టుగా హింట్ ఇస్తున్నారు.. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇలా సీక్వెల్‌ను నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున ప్లాన్ చేసేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ఎఫ్ 3 దిగనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో న‌వ్వులు పంచే కామెడీ చిత్రంగా రూపొంద‌నుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us