Vanisri వైరల్‌ న్యూస్ : రూ.20 కోట్ల ఆస్తి విషయంలో హీరోయిన్ కి సీఎం సాయం

NQ Staff - September 30, 2022 / 10:29 AM IST

Vanisri వైరల్‌ న్యూస్ : రూ.20 కోట్ల ఆస్తి విషయంలో హీరోయిన్ కి సీఎం సాయం

Vanisri : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ వాణిశ్రీ చాలా కాలం తర్వాత వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఒకానొక సమయంలో ఆమె ఇండియాలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా నిలిచిన విషయం తెలుస్తుందే.

ఆ సమయంలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న వాణిశ్రీ చెన్నైలో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారు. అందులో ఒక స్థలం 11 సంవత్సరాల క్రితం కబ్జాకు గురైంది. ఆ స్థలం కోసం వాణిశ్రీ సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఆమెకు ఆ స్థలం దక్కింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చొరవతో కబ్జా రాయుళ్ల నుండి వాణిశ్రీ కి ఆ స్థలం చేరింది. 11 ఏళ్ల పోరాటంకి ఎట్టకేలకు ఆమె విజయం సాధించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చొరవ తీసుకోవడం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భూముల రేట్లకు రెక్కలు రావడంతో కోట్ల విలువలు చేసే స్థలాలు కబ్జాలవుతున్నాయి, రాజకీయ నాయకులు అండ దండలతో కొందరు కబ్జాలు చేసి పబ్బం గడుపుతున్నారు. 20 కోట్ల రూపాయల విలువ చేసే వాణిశ్రీ స్థలం 11 ఏళ్ల క్రితం కబ్జా అవ్వడం.. ఇప్పుడు వాణిశ్రీ దాన్ని దక్కించుకోవడం గొప్ప విషయం.

ఈ విషయంపై వాణిశ్రీ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.11 ఏళ్ల క్రితం కబ్జా అయిన నా యొక్క భూమిని ముఖ్యమంత్రి స్టాలిన్ తిరిగి నాకు ఇప్పించారు. అందుకు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ వాణిశ్రీ ఆశీర్వదించారు. ప్రస్తుత విలువ ప్రకారం ఆ భూమికి తక్కువలో తక్కువ 20 కోట్ల రూపాయల ధర ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. స్టాలిన్ చేతుల మీదుగా వాణిశ్రీ కి ఆ పత్రాలు అధికారులు అందజేయించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us