CM KCR : ‘షాదీ ముబారక్’.. ఇది సీఎం కేసీఆర్ పథకం మాత్రమే కాదు..
Kondala Rao - February 17, 2021 / 12:46 AM IST

CM KCR : ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకి భలే ఆసక్తికరమైన పేర్లు పెడుతున్నారు. కాదేదీ కవితకనర్హం అన్నట్లు టైటిల్స్ కోసం దర్శక నిర్మాతలు చివరికి ప్రభుత్వ పథకాల పేర్లను కూడా వాడుకుంటున్నారు. దీనివల్ల అటు ఆ స్కీమ్ కి, ఇటు ఈ మూవీకి ఉచితంగా బోలెడు ప్రచారం లభిస్తుందనటంలో ఎలాంటి సందేహంలేదు. ఈ క్రమంలో వచ్చిన ఓ చిత్రం పేరు ‘‘షాదీ ముబారక్’’. ముందుగా టైటిల్ చూశాకే అసలు ఈ చిత్రాన్ని తీస్తున్నదెవరనే ఇంట్రస్ట్ కలిగి వెతకటం ప్రారంభించాను. ఈ మూవీని నిర్మిస్తున్నది ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
డైరెక్టర్ పేరూ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ముస్లిం మైనారిటీ ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం చేస్తున్న స్కీమ్ పేరు షాదీ ముబారక్. ఈ పేరు జనంలోకి బాగా వెళ్లింది. దీంతో దీన్నే దిల్ రాజు తన పిక్చర్ కి టైటిల్ గా పెట్టారు. అంతేకాదు. ఈ సినిమా దర్శకుడి పేరు కూడా మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘‘పద్మశ్రీ’’ కావటం గమనార్హం. ఇక హీరో హీరోయిన్లు ఎవరంటారా?.. వీర్ సాగర్, దృశ్యా రఘునాథ్. చూడటానికి కొంచెం పర్లేదు. బాగానే ఉన్నారు.
మార్చి 5న: CM KCR
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన షాదీ ముబారక్ చిత్రం మార్చి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అఫిషియల్ టీజర్ ని ఇవాళ (మంగళవారం) రిలీజ్ చేశారు. ఈ ఫిల్మ్ స్టోరీ లైన్ సైతం వెరైటీగా ఉండటం గమనార్హం. హీరోయిన్ కి తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయితోపాటు అతని ఇంటి పేరు కూడా నచ్చాలనుకునే మనస్తత్వం ఉంటుంది. అందువల్ల మ్యారేజ్ ముందు వరకూ పుట్టింటి పేరుతో బతికిన నేను ఇకపై వచ్చేవాడి ఇంటి పేరుతో బతకాలి కదా అందుకే నాకు ఆ అది కూడా నచ్చాలి అని తన తల్లిదండ్రులతో అంటుంది.

CM KCR : shaadi mubarak is not only a government scheme name..
టెంపరరీగా..
హీరో.. హీరోయిన్ ని మీ ఇంటి పేరేంటండి అని అడిగితే ఆమె.. టెంపరరీగా మా పేరెంట్స్ ఇంటి పేరునే వాడుకుంటున్నా అంటూ జోకేస్తుంది. అంతేతప్ప ఆ పేరును మాత్రం వెల్లడించదు. ఆ తర్వాత హీరో ఇంటి పేరు(సున్నిపెంట)ను హీరోయిన్ ఒకటికి పది సార్లు నొక్కి చెబుతుండటంతో అతనికి కోపం వచ్చి ఇకపై అలా అనొద్దని, కేవలం తన పేరుతోనే పిలవాలని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతకీ మీ ఇంటి పేరేంటి అంటూ నిలదీస్తాడు. దీనికి ఆమె చెప్పే సమాధానం, ఆ ఇంటి పేరును సరదాగా వెక్కిరిస్తూ కారు డ్రైవర్ చేసే యాక్షన్ మరోసారి నవ్వుతెప్పిస్తాయి.