Pooja Hegde : అందుకే గుంటూరు కారం నుంచి తప్పుకున్నా.. పూజాహెగ్డే క్లారిటీ..!
NQ Staff - June 23, 2023 / 09:10 AM IST

Pooja Hegde : ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా వస్తున్న మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ మూవీకి అన్నీ ఆటంకాలే వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు మూవీ షూటింగ్ ను వాయిదా వేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేశ్ తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయారు.
ఆ బాధ నుంచి తేరుకుని షూటింగ్ లో పాల్గొంటున్నారు మహేశ్. అయితే ఈ మధ్య మూవీ నుంచి తమన్ ను తీసేశారనే వార్తలు వస్తున్నాయి వాటిపై తమన్ ఘాటుగా స్పందించాడు. నాపై ఓర్వలేకనే కడుపు మండి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని వాపోతున్నాడు తమన్.
అదే సమయంలో పూజాహెగ్డే కూడా ఈ మూవీ నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా పూజాహెగ్డే మూవీ టీమ్ స్పందించింది. ఈ సినిమా నుంచి పూజా తప్పుకున్న మాట వాస్తవమే. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. మూవీ అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యం అవుతోంది.
ఇప్పటికే ఒప్పుకున్న మిగతా ప్రాజెక్ట్స్ కు చాలా ఇబ్బంది అవుతోంది. డేట్స్ అడ్జస్ట్ కాకనే ఈ మూవీ నుంచి తప్పుకుంటుంది పూజా అంటూ తెలిపింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. అయితే ఇప్పుడు శ్రీలీలనే మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అదే జరిగితే శ్రీలీల పంట పండినట్టే.