SIR: సార్ మూవీ నుండి భీమ్లా నాయ‌క్ బ్యూటీ ఔట్.. ఏం జ‌రిగింది..!

SIR: త‌మిళ స్టార్ హీరో ధనుష్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ త‌మిళ హీరో త‌మిళ ప్రేక్ష‌కుల‌నే కాకుండా త‌మిళ ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఏకంగా ఇద్దరు దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో శేఖర్ కమ్ముల సినిమా ఒకటి.. మరొకటి వెంకీ అట్లూరి సినిమా.

clarity comes on sir movie
clarity comes on sir movieclarity comes on sir movie

ఈ రెండు సినిమాల్లో ముందుగా వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు ధనుష్. రీసెంట్ గా రంగ్ దే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ.. ఇప్పుడు ధనుష్ కోసం ఓ అదిరిపోయే కథను సిద్ధం చేసి రంగంలోకి దిగుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజకార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ సినిమా టైటిల్ సార్ అని పెట్టడంతో ఆసక్తికరంగా అందరి దృష్టిని ఆకర్శించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను నిర్మిస్తున్న ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇక, ఈ సినిమాలో సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటిస్తున్న సంయుక్తనే ఈ సినిమా కోసం ఫైనల్ చేయడం అప్పుడు ఆసక్తి కరంగా చెప్పుకున్నారు. భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మించడం.. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే అందించే త్రివిక్రమ్ ధనుష్ సార్ సినిమాకు సహా నిర్మాతగా మారడం.. హీరోయిన్ ను ఆ సినిమాలో నటించిన సంయుక్తనే తీసుకోవడం ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది.

అయితే, ఇప్పుడు సార్ సినిమా నుండి సంయుక్త మీనన్ ను తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండగా.. సంయుక్త షూటింగ్ కు దూరంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై మేకర్స్ నుండి కానీ.. సంయుక్త నుండి కానీ ఇంకా ఎలాంటి స్పదన రాకాపోగా సంయుక్త సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ సినిమా అప్డేట్స్ గురించి పోస్టులు ఇంకా అలాగే ఉన్నాయి