సినిమా థియేటర్ ల ఓనర్ లు కేంద్ర ప్రభుత్వానికి రాసిన సంచలన లేఖ

Advertisement

సినిమా థియేటర్ ల ఓనర్ లు అందరు కలిసి వారి అసోసియేషన్ ద్వారా కేంద్రానికి ఒక లేఖ రాయడం జరిగింది. దానిలో థియేటర్ ల ఓపెనింగ్ పైన అనుమతి కోరడం చేశారు థియేటర్ యాజమాన్యం.. వివరాల్లోకి వెళితే కరోనా విజృంభిస్తుండడం తో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం … అయితే మొదట్లో అన్ని ప్రాంతాలకు మరియు పరిశ్రమలకు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ….

ఆన్ లాక్ ప్రక్రియతో తరువాత మెల్ల గా ఒక్కో దానికి లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తూ వచ్చింది… ఆలా సడలింపులు ఇచ్చిన తరువాత పరిస్థితి చూసి మిగిలిన పరిశ్ర్రమలకు మరియు రద్దీ గా ఉండే బిజినెస్ లకు అన్లాక్ ప్రకటించాలా…? వద్దా…? అన్న నిర్ణయానికి రావాలి అనుకుంది కేంద్ర ప్రభుత్వం .. కానీ ఆన్ లాక్ 1 తరువాత ఒక్క సారిగా భారత దేశం లో కరోనా కేసులు విస్తృతంగా పెరిగిపోయాయి. దానితో ఆన్ లాక్ 2 లో రద్దీగా ఉండే పాఠశాల లకు మరియు కాలేజీ లకు, అలాగే సినిమా థియేటర్ లకు అప్పుడే పర్మిషన్ లు ఇవ్వకూడదు అన్న నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభత్వం.

అయితే ఇప్పటికే లాక్ డౌన్ వలన 4 నెలలుగా థియేటర్ లు అన్ని కూడా మూసి వేయాల్సి రావడం తో థియేటర్ యజమానులు అందరూ కూడా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయాయారు. దానితో థియేటర్ యజమానులు అందరూ కలిసి అస్సోసియేయేషన్ తరుపున థియేటర్ లు కూడా తెరచుకోవడానికి పర్మిషన్ లు ఇవ్వండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు…. ఇప్పటి వరకు రద్దీ ప్రాంతాలు అయిన బస్సు లు మరియు దేవ స్థానాలకు కొన్ని నియమాలతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది అటువంటి కొన్ని నియమాలతో సినిమా థియేటర్ ల కు కూడా అనుమతులు ఇవ్వండి… మేము వాటిని పాటిస్తూనే సినిమా థియేటర్ లను కొనసాగిస్తాం అంటూ ఆ లేఖలో తెలిపినట్లు సమాచారం.

మరి వారు చెప్పిన విషయాలన్నీ సబబుగానే ఉండడం తో ఈ విషయం పైన ప్రభుత్వం కూడా అలోచించి అంగీకారం తెలపనుంది అని తెలుస్తుంది ఒక వేల ఈ పరిస్థితు లలో సినిమా థియేటర్ లు తెరవడానికి అనుమతులు ఇచ్చినప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమం లో ప్రజలు వచ్చే అవకాశాలు మాత్రం కనపడడం లేదు. మరి ఈ విధంగా అనుమతులు పొందినప్పటికీ నష్టాల్లో సినిమా థియేటర్ లని ఎలా నడిపిస్తారు … ఇలాంటి సమయం లో థియేటర్ లను ఓపెన్ చేయడానికి థియేటర్ యాజమాన్యం సిద్ధంగా ఉందా అస్సలు…. అన్న ప్రశ్నలు చాలా మంది లో తలెత్తుతున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here