సినిమాలు లేక కిరాణా దుకాణం పెట్టిన సినిమా డైరెక్టర్ ఆనంద్

Advertisement

సినిమాలు ఆగిపోవడం తో కిరాణా కొట్టు పెట్టుకున్న దర్శకుడు. అవును నిజంగానే ఒక దర్శకుడు గత కొంత కాలం గా సినిమాలు చేయడం ఆగిపోవడం తో బ్రతుకు తెరువు కొసం కిరాణా కొట్టు ని పెట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కరోనా వళ్ళ ఏర్పడిన పరిస్థితులతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎంతో మంది వారి జీవనాధారం కొలిపోయారు. మరి కొంతమంది తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయారు. ఇక సినీ పరిశ్రమ మరియు కొన్ని చిన్నపాటి ప్రైవేట్ స్కూల్స్ నడిపే వారి పరిస్థితి మరింత దయానీయంగా మారింది.

ఇప్పటికే కొంత మంది ప్రైవేట్ స్కూల్ టీచర్ లు మరియు చిన్న చిన్న ఆర్టిస్ట్ లు వారు ఈ లాక్ డౌన్ కాలం లో జీవించడానికి బయట చిన్న షాప్ లు మరియు రోడ్ల పైన పండ్లు అమ్మడం లాంటి ప్రత్యామ్నాయ ఉపాధి లను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపుగా లాక్ డౌన్ మొదలై సినీమా షూటింగ్ లు ఆగిపోవడం స్కూల్ లు మూతపడడం జరిగి వంద రోజులు ముగిసింది. ఇంకా ఎప్పటికి ఇవన్నీ మొదలవుతాయి అనేది చెప్పడం కూడా కష్టం గానే ఉంది. దానితో చాలా మంది కూలీలు గా చిన్నకారు వ్యాపారస్థులుగా మారక తప్పడం లేదు.

అదే విధంగా ఒక దర్శకుడు ఒక కిరాణ కొట్టు ని పెట్టుకోవడం జరిగింది. చెన్నై కి చెందిన ఒక సినీ దర్శకుడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అలాగే పూర్తి నష్టాల్లోకి కూరుకుపోకుండా ఉండేందుకు ఇలా తన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. పదేళ్లకు పైగా సినిమా రంగం లో ఉంది రెండు సినిమాలను చేసి ప్రస్తుతం మూడవ సినిమా చేస్తుండగా ఒక్క సారిగా ఇలా కరోనా, లాక్ డౌన్ ఎదురయి సినిమాలను నిలిపివేయడం తో కొంత మేరకు నష్టాల్లోకి వెళ్లిపోవడం జరిగింది ఆ సమయం లోనే ఖాళి గా ఉండలేక తన స్నేహితుడు సహాయం తో కిరాణ షాప్ తెరవడం జరిగింది అంట.

ఇలా షాప్ ని ప్రారంభించిన దర్శకుడు ఆనంద్ నిత్యావసర సరకులను తక్కువ ధరలకే అమ్ముతున్నాడు అని తెలపడం జరిగింది. ఇక సినిమా హాల్స్ తెరిచి మరల షూటింగ్ లు ప్రారంభించే వరకు తాను ఇలాగే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. అయితే తమిళ్ లో ఓరు మజాయ్ నాంగు సారాల్ సినిమా తో తమిళ ప్రేక్షకుల కు పరిచయం అయినా ఈయన ఆ తరువాత మౌన మజాయ్ చిత్రాన్ని విడుదల చేసాడు. ఆ రెండు సినిమాల తరువాత తునింతు సీ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న క్రమం లోనే ఒక్క సారిగా కరోనా వ్యాప్తి చెందడం లాక్ డౌన్ నిర్వహించడం షూటింగ్ లు నిలిపివేయడం తో తాను
చేసేటువంటి సినిమా షూటింగ్ అక్కడే ఆగిపోయింది . సినిమా హాల్ లు తెరుచుకొని మరల షూటింగ్ లు ప్రారంభం కాగానే తన సినిమాలని మొదలు పెట్టనున్నాడు అంట. ఈ దర్శకుడు మొత్తానికి కరోనా ఒక రకంగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టించి అందరి జీవితాలను మార్చేసిందనే చెప్పుకోవాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here