NTR: ఎన్టీఆర్ పాట‌తో కొరియోగ్రాఫ‌ర్ అవ‌తారం ఎత్తిన క‌మెడీయ‌న్

కొంద‌రిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. ప‌రిస్థితుల‌ని బ‌ట్టి అవి బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. ముఖ్యంగా జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంలో త‌మ కామెడీతో అల‌రించే న‌టీన‌టులు ఒక్కోసారి ఇత‌ర టాలెంట్‌తోను సంద‌డి చేస్తుంటారు. చ‌మ్మ‌క్ చంద్ర లాంటి వారు కామెడీతోనే కాదు డ్యాన్స్‌తోను అద‌రగొట్టేస్తారు. ఇక సుధీర్ లాంటి వారు అన్నింటా అద్భుతం అనిపిస్తాడు. జీవన్ డప్పు బాగా కొడతాడు ఇమ్మాన్యుయేల్, నూకరాజు మంచి సింగర్స్. అప్పారావు హరికథలు బాగా చెప్తాడు.

NTR
NTR

జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుల‌లో మ‌న‌కు తెలియ‌ని టాలెంట్ చాలా ఉంది. ఒక్కో కమెడియన్ ఒక్కో టాలెంట్‌తో దూసుకుపోతున్నాడు. అయితే గ‌త 8 ఏళ్లుగా అదిరే అభి టీమ్‌లో ఉంటూ ప్ర‌పంచానికి అంత‌గా ప‌రిచ‌యం కాని వ్యక్తి రాము. ఈయ‌న ఎక్స్‌ప్రెష‌న్స్ అంత‌గా పండించ‌లేర‌ని, కామెడీ కూడా చేయ‌లేర‌ని కొంద‌రు కామెంట్ చేస్తుంటారు. కాని ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్న ఆయ‌న త‌న‌లోని టాలెంట్‌ని మ‌రింత మెర‌గుప‌ర‌చుకుంటూ ఉంటాడు.

రాములో న‌టుడే కాదు కొరియోగ్రాఫ‌ర్ కూడా ఉన్నారు. మంచి పాట‌కు అద‌రిపోయే స్టైల్‌లో స్టెప్పులు వేసి అల‌రిస్తుంటాడు రాము. ప్ర‌తి ఆదివారం వ‌చ్చే శ్రీదేవి డ్రామా కంపెనీలో రాము ఢీ డాన్సర్ పండుతో ఓ పాటను కంపోజ్ చేసాడు . జూనియర్ ఎన్టీఆర్ కంత్రిలోని ఐ గో క్రేజీ పాటను కంపోజ్ చేసాడు రాము. ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

రాము స్టెప్పుల‌ని చూసి ఢీలోను రాముకి ఛాన్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్లంద‌రు రాము ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. అభి చాటున ఇన్నాళ్లు దాగిన రాము ఎట్ట‌కేల‌కు త‌న డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అంద‌రి దృష్టి ఆకర్షించాడు.