Choreographer Rakesh Master : నా శవాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వండి.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్..!
NQ Staff - June 19, 2023 / 10:27 AM IST

Choreographer Rakesh Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ చనిపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1500లకు పైగా సినిమాలకు ఆయన పని చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఎంతోమంది స్టార్ కొరియోగ్రాఫర్లను తీర్చిదిద్దారు. అలాంటి ఆయన నిన్న అకాల మరణం చెందారు.
రాకేష్ మాస్టర్ కు నా అన్న వారు లేకుండా పోయారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితో విడిపోయారు. రెండో భార్యతో చరణ్ అనే కొడుకును కన్నారు. నా అన్న వారందరికీ దూరం కావడంతో రాకేష్ మాస్టర్ తాను చనిపోతే ఏం చేయాలో కూడా ముందే చెప్పాడు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.
నేను చనిపోతే నా శవాన్ని కాల్చొద్దు. నాకు ఎలాంటి మత విశ్వాసాలు లేవు. కుల పట్టింపులు కూడా లేవు. నేను చనిపోయిన తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడితే అదే చాలు. అందుకే నా శవాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వండి. మెడికల్ కాలేజీ డాక్టర్లకు నేను ఉపయోగపడితే నాకు సంతోషంగా ఉంటుంది.
మెడికల్ కాలేజీలకు శవాలు దొరకట్లేదు. కాబట్టి నా శరీర దానం చేస్తున్నాను అంటూ ముందే తెలిపాడు రాకేష్ మాస్టర్. నా కొడుక్కు, నా భార్యకు ఎలాంటి ఖర్చు లేకుండా చూస్తాను. నేను చనిపోయిన తర్వాత ఏవైనా అవయవదానాలు కూడా చేయండి. నా శరీరం మొత్తాన్ని మెడికల్ కాలేజీలోనే ఉంచండి అంటూ తెలిపారు రాకేష్ మాస్టర్. మరి కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.