Choreographer Rakesh Master : రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసిన ఫ్యామిలీ..!
NQ Staff - June 18, 2023 / 08:01 PM IST

Choreographer Rakesh Master : టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మృతి చెందారు. గత 20 రోజలుగా ఆయన కంటిన్యూగా ఔట్ డోర్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. కంటిన్యూగా వాంతింగ్స్, విరోచనాలతో బాధపడ్డారు.
ఈ రోజు విజయవాడ నుంచి వస్తుండగా ఆయనకు సన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో రక్త వాంతులు కావడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ మధ్యాహ్నం 1గంటకు జాయిన్ చేయగా.. గంటగంటకూ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మల్టీ ఆర్గాన్స్ దెబ్బతినడంతో ఆయన సాయంత్రం 5గంటలకు మృతి చెందారు.

Choreographer Rakesh Master Eyes Donated By His Family
ఇక ఆయన కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో కూడా గొప్ప నిర్ణయం తీసుకుంది. రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేస్తున్నట్టు ప్రకటించింది. చూపులేని వారికి రాకేష్ మాస్టర్ కళ్లు చూపును ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. అందుకే ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్టు రాకేష్ మాస్టర్ టీమ్ ప్రకటించింది.
ఇక రాకేష్ మాస్టర్ ఇప్పటి వరకు 1500లకు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. కానీ కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయనకు మతి స్థిమితం సరిగా లేదనే వాదన కూడా ఉంది. ఏదేమైనా రాకేష్ మాస్టర్ నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.