CHIRANJEEVI: పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌పై చిరు అసంతృప్తి.. దేవి శ్రీని ఫ్రేంలోకి తీసుకొచ్చే ప్రయత్నం..!
Samsthi 2210 - February 20, 2021 / 01:17 PM IST

CHIRANJEEVI మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా సైరా చిత్రంతో ప్రేక్షకులని అలరించిన చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు.
ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మూడు ప్రాజెక్టులు చేయనున్నాడు. ఇప్పటికే వాటికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనలు వచ్చేశాయి ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ చిత్ర రీమేక్ మొదలు పెట్టనున్న చిరంజీవి ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించనున్నాడు. మరోవైపు బాబీ దర్శకత్వంలోను చిరంజీవి ఓ చిత్రం చేయనుండగా, దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం బాబీ- చిరంజీవి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలలో నటీనటులు ఎవరిని ఎంపిక చేయాలి, సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయట. సంగీత దర్శకుడిగా మణిశర్మని తీసుకోవాలని బాబీ ఆలోచించాడట. దానికి చిరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆచార్య చిత్రానికి మణిశర్మ సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇవ్వలేదని, బాణీలు కూడా అంతగా అలరించేలా లేవని అతనిని రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఉప్పెన సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్‌ని తన సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక చేయాలని చిరు భావిస్తున్నట్టు టాక్. ఇందులో ఎంత క్లారిటీ ఉందనేది రానున్న రోజులలో తేలనుంది.