ప్ర‌భాత స‌మ‌యాన‌.. మా ఇంటి మందారం కొప్పు సింగారించుకుంది: చిరు

Samsthi 2210 - October 31, 2020 / 10:59 AM IST

ప్ర‌భాత స‌మ‌యాన‌.. మా ఇంటి మందారం కొప్పు సింగారించుకుంది: చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్ర‌స్తుతం ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈమూవీ పూర్తైన త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ప‌లువురు యంగ్ ద‌ర్శ‌కుల‌తోను చిరు క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

లాక్ డౌన్ స‌మ‌యంలో ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వీటి ద్వారా అనేక విష‌యాలు షేర్ చేస్తూ వ‌స్తున్నారు. చిరంజీవి చేసే పోస్ట్‌లు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా ఆయ‌న ప్ర‌భాత స‌మ‌యంలో విర‌బూసిన మందారం ఫోటోని షేర్ చేస్తూ కామెంట్‌గా అద్భుత‌మైన క‌విత పోస్ట్ చేశారు. ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది ..
అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది! అని రాసుకొచ్చారు. ప్ర‌కృతి సౌంద‌ర్యం ఇది అని ఆయ‌న అన్నారు.

జూబ్లిహిల్స్ లో నివ‌సిస్తున్న చిరంజీవి కొన్ని రోజుల క్రితం ఓ వీడియోని షేర్ చేస్తూ.. అప్పుడే ఉద‌యిస్తున్న సూర్యుడిని చూపించారు. ఇన్నాళ్ళు మ‌నం ప‌ట్టించుకోలేదు అని సిటీ ఎంత ప్ర‌శాంతంగా ఉంద‌ని పేర్కొన్నారు. అలానే ఇంటి ముందు పెద్ద లాన్.. పూల చెట్లు.. పెద్ద స్విమ్మింగ్ పూల్.. ఆ పక్కనే కార్లు.. దాంతో పాటు విలాస‌వంత‌మైన భ‌వానాన్ని వీడియోలో చూపించారు. ఇది నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. రెండేళ్ల పాటు జూబ్లీ హిల్స్‌లోనే ఓ ఇంట్లో రెంట్‌కు ఉన్న మెగాస్టార్.. పాత ఇంటిని పూర్తిగా రెన్యువేష‌న్ చేయించుకొని దాంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఇది ఇంద్ర‌భ‌వ‌నంలా క‌నిపిస్తుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us