CHIRANJEEVI: చిరంజీవికి గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు.. కృత‌జ్ఞ‌తలు తెలిపిన మెగాస్టార్

CHIRANJEEVI టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పై క‌రోనా పంజా విసిరిన విష‌యం తెలిసిందే.ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డ్డారు. థియేటర్స్ సైతం మూత‌ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో సినీ రంగానికి చెందిన కార్మికులు క‌ష్టాల‌లో ఉన్నారు. ఈ ప‌రిస్థితి గ‌మ‌నించిన చిరంజీవి సినీ కార్మికులతోపాటు జర్నలిస్టులకు సైతం ఉచితంగా వ్యాక్సిన్లు వేయించేందుకు ముందుకొచ్చారు. అపోలో ఆస్పత్రి సాయంతో సినీ కార్మికులకు త్వరలో ఉచిత వ్యాక్సిన్లు వేయించబోతున్నట్లు చిరు ప్రకటించారు. ఏప్రిల్‌ 22న ప్రారంభమయ్యే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తారు. సినీ కార్మికుల కుటుంబ సభ్యులకూ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద‌మ‌న‌సుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. లెజండ‌రీ చిరంజీవిగారు క‌రోనా సంక్షోభం స‌మ‌యంలో ఉచితంగా టీకా అందిస్తాన‌ని ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంది. స‌మాజం కోసం ఆయ‌న ప్ర‌శంస‌నీయ‌మైన కృషిని అభినందిస్తున్నాను అని గ‌వ‌ర్నర్ త‌మిళ సై త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ట్వీట్‌పై స్పందించిన చిరంజీవి మీ ప్ర‌శంస‌లకు కృత‌జ్ఞులం. క‌రోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా ఈ చొర‌వ‌కు స‌హ‌క‌రిస్తున్న ప్ర‌తి స‌భ్యునికి మీ మాట‌లు ధైర్యాన్ని అందిస్తాయి అని మెగాస్టార్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement